మీ ఫోన్ ఇంటర్నెట్ నెట్ స్లోగా ఉందా.. జస్ట్ ఈ సెట్టింగ్‌ని మార్చండి..

By Ashok kumar SandraFirst Published Apr 4, 2024, 11:09 PM IST
Highlights

కాల్ డ్రాప్స్‌తో చాల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు  ఊర్లల్లో ఉండే వారు  కాల్స్ ఇంకా ఇంటర్నెట్ రెండింటి సమస్యను ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్ సిగ్నల్ ఉన్న  కూడా ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, ఈ టిప్  మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఇండియాలో  5G నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. అన్ని టెలికాం కంపెనీల వాదనల ప్రకారం, హై స్పీడ్ 5G ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మూలకు చేరుకుంది, అయితే గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే, కాల్ డ్రాప్‌ల వల్ల నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంకా గ్రామీణులు కాల్స్ అలాగే  ఇంటర్నెట్ సమస్య రెండింటినీ ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్ సిగ్నల్   ఉన్న  కూడా ఇంటర్నెట్ స్లోగా  ఉండటం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, ఈ టిప్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్ స్పీడ్  ఎలా పెంచుకోవాలో చూద్దాం... 

నెట్‌వర్క్ సెట్టింగ్స్  మార్చండి
మీ ఇంటర్నెట్ స్లోగా ఉంటే ముందుగా ఫోన్ సెట్టింగ్‌లను చెక్ చేయండి. ఫోన్ సెట్టింగ్‌లలోని నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి, ప్రైమరీ నెట్‌వర్క్  5G లేదా ఆటోగా సెలెక్ట్ చేయండి.

సరైన APN చాలా ముఖ్యం.
నెట్‌వర్క్ సెట్టింగ్‌లలో యాక్సెస్ పాయింట్ నెట్‌వర్క్ (APN) సెట్టింగ్‌ను కూడా చెక్  చేయండి, ఎందుకంటే స్పీడ్ కి సరైన APN ఉండటం ముఖ్యం. APN సెట్టింగ్‌ల మెనుకి వెళ్లి, సెట్టింగ్‌ను డిఫాల్ట్‌గా సెట్ చేయండి.

సోషల్ మీడియా యాప్స్ 
ఫోన్‌లో ఉన్న సోషల్ మీడియాపై నిఘా ఉంచండి. Facebook, X అండ్ Instagram వంటి యాప్‌లు స్పీడ్ని తగ్గిస్తాయి అలాగే  ఎక్కువ డేటాను వినియోగిస్తాయి. వీటి సెట్టింగ్‌లకు వెళ్లి ఆటో ప్లే వీడియోను ఆఫ్ చేయండి. అలాగే ఫోన్ బ్రౌజర్‌ని డేటా సేవ్ మోడ్‌లో సెట్ చేయండి.

రీసెట్ అనేది లాస్ట్  అప్షన్ 
మీరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్పీడ్  లేకపోతే  మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి. డిఫాల్ట్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లో మంచి స్పీడ్ పొందడానికి  అవకాశం ఉంది.

click me!