ఈ సర్వీస్ ఏప్రిల్ 15 నుండి బంద్.. గవర్నమెంట్ నోటిస్ జారీ..

By Ashok kumar SandraFirst Published Apr 4, 2024, 10:36 PM IST
Highlights

USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సర్వీస్  నిలిపివేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఏప్రిల్ 15, 2024 తర్వాత దేశంలో కాల్ ఫార్వార్డింగ్ సర్వీస్ నిలిపివేయనుంది. 
 

దేశంలో రోజురోజుకు జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సర్వీస్ నిలిపివేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఏప్రిల్ 15, 2024 తర్వాత దేశంలో కాల్ ఫార్వార్డింగ్ సర్వీస్ నిలిపివేయబడుతుంది.

దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఒక నోటీసు జారీ చేసింది, దీనిలో USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ కోసం అన్ని లైసెన్స్‌లు ఏప్రిల్ 15 నుండి చెల్లుబాటు కావు. ఆన్‌లైన్ మోసాలను నిరోధించేందుకు ఆ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  USSD అనేది ఒక  కోడ్‌ని డయల్ చేయడం ద్వారా ఒక నంబర్‌ పై అని సర్వీసెస్  యాక్టీవ్ చేయగల అండ్    డియాక్టీవ్  చేయగల ఫీచర్. IMEI నంబర్ USSD కోడ్ ద్వారా కూడా కనుగొనబడుతుంది.

కాల్ ఫార్వార్డింగ్  ప్రతికూలతలు
కాల్ ఫార్వార్డింగ్ ఫీచర్ ద్వారా మీ నంబర్‌కు వచ్చే మెసేజ్‌లు, కాల్‌లను ఇతర నంబర్‌కు  ఫార్వార్డ్ చేయవచ్చు. అయితే మోసగాళ్లు యూజర్లకు ఫోన్ చేసి తాము  టెలికాం కంపెనీ నుండి మాట్లాడుతున్నట్లు చెబుతు మీ నంబర్‌లో నెట్‌వర్క్ సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించిందని  చెబుతు మోసాలకు పాల్పడుతున్నారు. 

ఇలాంటి వాటిని అధిగమించడానికి ఒక నంబర్‌ని డయల్ చేయండి. ఈ USSD నంబర్ కాల్ ఫార్వార్డింగ్ కోసం ఉద్దేశించబడింది. USSD కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత, అన్ని మెసేజెస్  ఇంకా కాల్స్ స్కామర్  ఫోన్‌కు ఫార్వార్డ్ చేయబడతాయి, ఆ తర్వాత వారు OTPని అడగడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ అలాగే మీ సోషల్ మీడియా అకౌంట్ కు  కూడా యాక్సెస్  పొందవచ్చు. కాల్స్  ఫార్వార్డ్ చేయడం ద్వారా, మీ పేరు అండ్ నంబర్‌లో ఇతర సిమ్ కార్డ్‌లను కూడా జారీ చేయవచ్చు.

click me!