ఆపిల్ ఈవెంట్-2022: కారు ప్రమాదం జరిగినపుడు ఐఫోన్ 14లో అద్భుతమైన ఫీచర్.. స్పెషాలిటీ ఎంటో తెలుసుకోండి..

By asianet news telugu  |  First Published Sep 8, 2022, 2:02 PM IST

ఈ కొత్త ఐఫోన్ టెలికాం నెట్‌వర్క్ లేదా వై-ఫై లేకుండా మారుమూల ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికీ సాటిలైట్ ద్వారా ఎమెర్జెన్సీ కంట్రోల్ రూంని సంప్రదించడానికి సహకరిస్తుంది.


ప్రముఖ దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీ ఆపిల్ బుధవారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే కారు ప్రమాదంలో పరిస్థితిని పసిగట్టిన తర్వాత ఐఫోన్ 14 ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ నంబర్లకు కాల్స్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ కొత్త ఐఫోన్ టెలికాం నెట్‌వర్క్ లేదా వై-ఫై లేకుండా మారుమూల ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికీ సాటిలైట్ ద్వారా ఎమెర్జెన్సీ కంట్రోల్ రూంని సంప్రదించడానికి సహకరిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ బుధవారం రాత్రి జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో ఇలాంటి ఎన్నో ఫీచర్లతో కూడిన కొత్త ఐఫోన్స్, వాచీలు, ఇతర టెక్నాలజీని ఆవిష్కరించారు. ఈ సంవత్సరం అంటే వరుసగా మూడవసారి ఈవెంట్ యూ‌ఎస్ లోని కుపెర్టీనోలో జరిగింది. అయితే ఈ  ఈవెంట్‌ ఆపిల్  అధికారిక వెబ్‌సైట్, ఆపిల్  యుట్యూబు ఛానెల్, ఆపిల్ టి‌వి యాప్‌లో లైవ్ టెలికాస్ట్ చేసింది.

Latest Videos

ఐఫోన్ 14 , ఐఫోన్ 14 Plus ఫీచర్లు: పెద్ద సైజ్, బెస్ట్ కెమెరా
*ఐఫోన్  కొత్త సిరీస్ ని 6.1 ఇంకా 6.7 అంగుళాల సైజ్ తో గేమింగ్ అండ్ షోలను చూడటంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం స్క్రీన్ పెద్దగా ఇచ్చారు. అలాగే 5 కలర్స్ లో లాంచ్ చేశారు.
* బ్యాటరీ లైఫ్ కనీసం 24 గంటల పాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
*ఆపిల్ కొత్త A15 బయోనిక్ చిప్ కారణంగా పర్ఫర్మేన్స్  18% వేగంగా ఉంటుంది
*12ఎం‌పి  మెయిన్, 12ఎం‌పి ఫ్రంట్ కెమెరాతో అల్ట్రా వైడ్ అండ్ ఆటోఫోకస్ మొదటిసారి అందించింది. అలాగే ఫోటోనిక్ ఇంజన్ టెక్నాలజీ, ఇది తక్కువ వెలుతురులో రెండింతలు మెరుగైన ఫోటోలను తీయడంలో సహాయపడుతుంది.

కొత్త సేఫ్టీ ఫీచర్లు...క్రాష్ డిటెక్షన్  
కొత్త ఐఫోన్స్  కారు ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ నంబర్లకు కాల్స్ చేస్తుంది. ప్రమాదం జరిగినట్లు మోషన్ సెన్సార్, యాక్సిలరోమీటర్ ఇంకా గైరోస్కోప్ ద్వారా నిర్ధారించుకుంటుంది. ఫోన్ కాల్స్ ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత మొదలవుతుంది.

ఫోన్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ 
సాటిలైట్ ద్వారా సపోర్ట్ కోసం ఫోన్లో 'ఎమర్జెన్సీ SOS' ఫీచర్ ఇచ్చారు. స్పష్టమైన ఆకాశంలో శాటిలైట్ ద్వారా 15 సెకన్లలో ఇంకా ఇతర పరిస్థితులలో కొన్ని నిమిషాల్లో కంట్రోల్ సెంటర్ కి మెసేజెస్ పంపుతుంది. ఈ సర్వీస్ మొదటి 2 సంవత్సరాలు ఉచితం. దీనిని వచ్చే నేల నవంబర్‌లో యూ‌ఎస్, కెనడాలో ప్రారంభించనున్నారు.

 సిమ్ స్లాట్ ఉండదు
అమెరికాలోని అన్నీ ఐఫోన్ మోడల్స్ లో సిమ్ ట్రే ఉండదు.  వీటిలో ఇ-సిమ్ ఉంటుంది, ఇందులో యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే సెల్యులార్ ప్లాన్‌ని వెంటనే మరొకదానికి మార్చవచ్చు. ఫోన్ పోయినట్లయితే సిమ్ కార్డ్ మార్చడం ద్వారా ఇతరులు దీనిని ఉపయోగించలేరు.

ఐఫోన్ 14 ధర : $799 నుండి ప్రారంభమవుతుంది అంటే రూ.63,000పైగా 
ఐఫోన్ 14 ప్లస్ ధర : $899తో నుండి ప్రారంభమవుతుంది అంటే రూ.71,000 పైగా

ఐఫోన్ 14 ప్రొ, ప్రొ మ్యాక్స్  ఫీచర్లు:

 ఈ రెండు లేటెస్ట్ ఫోన్‌లలో Face ID, ముందు భాగంలో ఫ్లూయిడ్ యానిమేషన్‌తో  కెమెరాలు ఉంటాయి. ఈ రెండు ఫోన్‌లలో A16 బయోనిక్ చిప్‌ ఇచ్చారు, దీనిని అన్ని స్మార్ట్‌ఫోన్‌ల కన్నా  వేగవంతమైన చిప్‌గా కంపెనీ తెలిపింది. వీటిలో క్వాడ్ కెమెరాలు ఉన్నాయి, అందులో 48 MP మెయిన్, 12 MP సెకండ్ అండ్ అల్ట్రా వైడ్ ఉన్నాయి. అలాగే 1 TB వరకు స్టోరేజ్ పొందవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఐఫోన్ 14 ప్రొ ధర : $999 నుండి ప్రారంభం  అంటే రూ.79,000కు పైమాటే
ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్  : $1099 నుండి ప్రారంభమవుతుంది అంటే రూ.87,000కు పైమాటే 

click me!