ఇండియాలో ఐఫోన్‌...తయారీ, విక్రయాలు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసా...?

By Sandra Ashok Kumar  |  First Published Nov 26, 2019, 11:05 AM IST

భారతదేశంలో టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11 ఫోన్లను ఉత్పత్తి చేయనున్నది. విదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.


న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీ రంగంలో మరో ముందడుగు పడింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నాలజీ దిగ్గజం ‘ఆపిల్‌’ తన ఐఫోన్‌ ఎక్స్ఆర్ మోడల్‌ తయారీని భారత్‌లో ప్రారంభించిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

also read మొత్తం 120 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్...ఫోన్‌ నంబర్లతో సహ

Latest Videos

ఆపిల్ తయారు చేసే ఐఫోన్ సిరీస్ ఫోన్ల విక్రయాలు దేశీయంగా విక్రయాలతోపాటు ఎగుమతులు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆపిల్‌కు ఛార్జర్లు సరఫరా చేసే సాల్‌కాంప్‌ కంపెనీతో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. చెన్నై నగరానికి సమీపంలోని సెజ్‌లో మూతపడిన నోకియా ప్లాంట్‌ను ఆ కంపెనీకి కేటాయించినట్లు చెప్పారు. 

2020 మార్చి నుంచి అక్కడ ఆపిల్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.2వేల కోట్లు ఆ కంపెనీ పెట్టుబడి పెట్టనుందని వివరించారు.

also read  ఇక స్మార్ట్ ఫోన్ లోనే ఆధార్ కార్డ్...ఎలా అంటే ?

పదేళ్లుగా మూతపడిన నోకియా ప్లాంట్‌ను సాల్‌కాంప్‌ పునరుద్ధరించనున్నది. దీని ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభించనుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. అలాగే దేశీయ మొబైల్‌, ఇతర విడిభాగాల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో 1.6 బిలియన్‌ డాలర్లు దాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

click me!