ఇక స్మార్ట్ ఫోన్ లోనే ఆధార్ కార్డ్...ఎలా అంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Nov 25, 2019, 6:19 PM IST

IOS మరియు ఆండ్రయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం కొత్త ఏంఆధార్ యాప్  ప్రారంభించారు. కొత్త mAadhaar యాప్ ఉపయోగించడం చాలా తేలిక మరియు సులభం.  పాత వెర్షన్ యాప్   వెంటనే తొలగించాలని  కొత్తదాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని UIDAI ప్రతి ఒక్కరికి కోరుతుంది,


యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) తన ఎంఆధార్ యాప్  కొత్త వెర్షన్‌ను ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ కోసం విడుదల చేసింది. పాత వెర్షన్ యాప్   వెంటనే తొలగించాలని  కొత్తదాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని UIDAI ప్రతి ఒక్కరికి కోరుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న యాప్స్ ఎప్పుడైనా పనిచేయడం ఆగిపోతాయి లేదా థర్డ్ పార్టీ నుండి పనిచేసే యాప్స్ ఇక పనిచేయవు. 

ఈ యాప్ మీ ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, ఫోటోగ్రాఫ్ వంటి జనాభా డేటా సమాచారం పొందటానికి సహాయపడుతుంది. కొత్త ఏంఆధార్ యాప్ ఉపయోగించడం చాలా సులభం.

Latest Videos

undefined


ఏంఆధార్ యాప్ ఎలా ఉపయోగించాలి
మొదట కొత్త   యాప్  ఉపయోగించడానికి మీరు ఆధార్ యాప్ లో లాగిన్ అయి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ను రిజిస్టర్ చేయాలి. అలా చేయడానికి మీరు “మీ ఆధార్‌ను నమోదు చేసుకోండి” అని పేర్కొన్న టాప్ బ్యానర్‌పై క్లిక్ చేయవచ్చు.

క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఆధార్ నంబర్‌ను ఇన్పుట్ చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు OTP వచ్చే వరకు వేచి ఉండండి. OTP వచ్చిన తర్వాత, దాన్ని యాప్ లో ఎంటర్ చేయండి. దీనితో మీరు మీ ఆధార్ కార్డుకు లింక్ చేసే ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ ఆధార్ కార్డు  కాపీని కలిగి ఉంటారు.

also read మొత్తం 120 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్...ఫోన్‌ నంబర్లతో సహ


కొత్త ఆధార్ కార్డ్ ప్రింట్ ఎలా పొందాలి 

తరచూ మీరు మీ వస్తువులను కోల్పోయినపుడు లేదా మీ ఆధార్ కార్డును మర్చిపోయిన కొత్త ఆధార్ కార్డ్ ప్రింట్ పొందటానికి మీరు రిక్వెస్ట్ పెట్టొచు.యాప్ యొక్క మొదటి పేజీలో ‘ఆర్డర్ ఆధార్ రీప్రింట్’ ఆప్షన్ ఉంటుంది, ఇది మీ ఆధార్ కార్డు యొక్క కొత్త ప్రింట్ పొందడానికి మీరు దీనిపై  క్లిక్ చేయవచ్చు.

మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉందా లేదా అని యాప్ లో అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ యాప్ లో ఎంటర్  చేశాక మిమ్మల్ని మీ ఆధార్ వివరాలను నమోదు చేసే కొత్త పేజీకి తీసుకెళుతుంది. ఆ తర్వాత మీరు మీ వివరాలను నమోదు చేసి చెల్లింపు చేయండి తరువాత మీ కార్డు వచ్చే వరకు వేచి ఉండండి.

గుర్తుంచుకోండి, ఈ సదుపాయం ఉచితం కాదు దీనికి చెల్లించిన మీ డబ్బులు మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వబడవు . కొత్త ఆధార్ ప్రింట్ ఆర్డర్ ఇచ్చే సమయంలో వినియోగదారుకు రూ .50 వసూలు చేస్తారు. ఇది స్పీడ్ పోస్ట్ ఛార్జ్ మరియు జిఎస్టితో కలిపి ఉంటుంది. కార్డును ముద్రించడానికి ఇంకా స్పీడ్ పోస్ట్‌కు అప్పగించడానికి UIDAI ఐదు రోజుల వరకు సమయం పడుతుంది.

also read బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవల విస్తరణ... 70వేల చోట్ల 4జీ సేవలు...

ఆధార్ వివరాలను పంచుకోవడం

మీరు ఎక్కడైనా మీ ఆధార్ నంబర్‌ను అందించాల్సి వస్తుంది కానీ కొంతమంది వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ప్రజలతో పంచుకోవడం ఇష్టం ఉండదు. ఈ యాప్ ఒక మంచి ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ వివరాలను QR కోడ్ ద్వారా లేదా తక్కువ సమయం వరకు సృష్టించిన వర్చువల్ ID ద్వారా పంచుకోవచ్చు.

యాప్ ద్వారా ఆధార్ OTP ని పొందడం
కొన్నిసార్లు OTP మెసేజ్ సర్వీసెస్ పనిచేయవు, లేదా గడువు ముగిసిన తర్వాత మీకు OTP వస్తుంటుంది. మీరు ఈ సమస్యలను ఎదుర్కొంటుంటే దానిని పరిష్కరించడానికి యాప్ మీకు తాత్కాలిక OTP లను అందిస్తుంది, ఇవి కొన్ని సెకన్ల పాటు చెల్లుతాయి.


బయోమెట్రిక్‌ ద్వారా యాప్ లాక్ / అన్‌లాక్ చేయడం

మీరు మీ ప్రైవసీ గురించి ఆందోళన చెందుతుంటే బయోమెట్రిక్స్ సహాయంతో ఎవరైనా మీ ఆధార్ వివరాలను పొందకూడదు ఆనుకుంటే మీరు యాప్ లో ఆధార్ వివరాలను బయోమెట్రిక్‌ ద్వారా తాత్కాలికంగా లాక్ చేసి, అన్‌లాక్ చేయవచ్చు. 

click me!