విస్తరణ వైపు అమెజాన్: జూలై 15-16 ప్రైమ్ డే కోసం చకచకా ఏర్పాట్లు

By rajesh yFirst Published Jul 8, 2019, 12:42 PM IST
Highlights

బీహార్ రాజధాని పాట్నా, అసోం రాజధాని గువాహటీల్లో స్పెషలైజ్డ్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అమెజాన్ నిర్ణయించింది. తద్వారా ఇతర నగరాలకు విస్తరణ దిశగా అమెజాన్ అడుగులేస్తున్నది.

న్యూఢిల్లీ: గ్లోబల్ ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ అనుబంధ అమెజాన్ ఇండియా దేశీయంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రత్యేకంగా డెవలప్ చేసిన గోదాములను పాట్నా, గువహాటిల్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇప్పటికే స్పెషలైజ్డ్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లుగా ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్నాయి. ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ భవిష్యత్‌లో డెలివరీ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

సంప్రదాయ గోదాములకు బదులు ఉన్నతస్థాయిలో ఆటోమేటిక్‌గా పిక్, పాక్ అండ్ షిప్పింగ్ ప్రాసెసింగ్‌కు అమెజాన్ ఫుల్ ఫిల్‌మెంట్ సెంటర్లు అనుకూలంగా ఉన్నాయి. సమయానుకూలంగా కస్టమర్లకు ఆర్డర్ చేసిన వస్తువులను సరఫరా చేసేందుకు అమెజాన్ ఫుల్ ఫిల్‌మెంట్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. 

స్పెషలైజ్డ్ ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లతో కూడిన నెట్‌వర్క్ గల అమెజాన్ ఫర్నీచర్, భారీ స్థాయిలో గ్రుహోపకరణాలను సకాలంలో సరఫరా చేసేందుకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నది. పాట్నా, గువాహటిలతోపాటు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లుధియానా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో పూర్తిస్థాయి స్పెషలైజ్డ్ కెపాసిటీతో కూడిన ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లను అమెజాన్ తీర్చి దిద్దుతోంది. 

ఈ నెల 15-16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ కోసం సిద్ధం అయ్యేందుకు ఈ ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఏర్పాట్లు చేస్తోంది. అమెజాన్ కస్టమర్ ఫుల్ ఫిల్మెంట్ ఆసియా విభాగం ఉపాధ్యక్షుడు అఖిల్ సక్సేనా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అమెజాన్ ఇండియా ఇప్పుడు స్పెషలైజ్డ్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లతో కూడిన నెట్ వర్క్ కలిగి ఉంది. గతేడాది డిసెంబర్ నాటి ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లతో పోలిస్తే 40 శాతం విస్తరించి 90 లక్షల క్యూబిక్ అడుగులకు విస్తరించింది’ అని తెలిపారు. 

అమెజాన్ డాట్ ఇన్ ‘రిటైల్ దిగ్గజం’ తన ప్రత్యర్థి వాల్ మార్ట్ సారథ్యంలోని ఫ్లిప్ కార్ట్‌తో పోటీ పడుతోంది. 3,500కి పైగా ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లతోపాటు 1.2 లక్షలకు పైగా ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. స్పెషలైజ్డ్ నెట్వర్క్ ద్వారా విస్తరించనున్నామని తెలియజేయడానికి తాము సంతోషిస్తున్నామని సక్సేనా తెలిపారు. తాజా ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాల ప్రారంభంతో అమెజాన్ సంస్థ 200 నగరాలు, పట్టణాల పరిధిలో 50కి పైగా ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాల స్థాయికి చేరుకుంది. 

click me!