నోకియా 6.1 ఫోన్ ధర రూ.2000 తగ్గింపు.. బట్ ఆన్‌లైన్‌లోనే

By Siva Kodati  |  First Published Jul 7, 2019, 11:37 AM IST

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా తన 6.1 ఫోన్‌పై ధరను రూ.2000 తగ్గించివేసింది. దీంతో 3జీబీ విత్ 32 ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్ ధర రూ.6,999, 4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.10,999లకు లభిస్తుంది. కాకపోతే ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ ఫోన్ ధరల తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది.


ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా 6.1 ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ధరను మరో రూ.2000 తగ్గించింది. దీంతో 3జీబీ ర్యామ్‌ విత్ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ గల మొబైల్‌ ఫోన్ రూ.6,999, 4జీబీ విత్ 64జీబీ వేరియంట్‌ ఫోన్ ధర రూ.9,999లకే లభించనుంది. 

తగ్గించిన ధరలతో ఆన్ లైన్ రిటైల్ సంస్థలు అమెజాన్‌, ప్లిఫ్‌కార్ట్‌లలో ఇది అందుబాటులో ఉంటుందని హెచ్‌ఎండీ గ్లోబల్‌ పేర్కొంది. అంతకు ముందు వీటి ధరలు వరుసగా రూ.8,999, రూ.10,999 గా ఉండేవి. ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో మాత్రం వీటి ధరలను తగ్గించలేదని తెలిపింది.

Latest Videos

గతేడాది విడుదల చేసిన ఈ ఫోన్‌  4జీబీ విత్ 64జీబీ స్టోరేజీ ఫోన్ ప్రారంభ ధర 16,999 గా ఉండేది. ప్రస్తుతం మొబైల్‌ మార్కెట్‌లో పెరిగిన పోటీ వల్ల క్రమంగా నోకియా ధరలను తగ్గించుకుంటూ వచ్చింది.

5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే గల ఈ ఫోన్ 32 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో 4 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఓక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌తోపాటు 16 మెగాపిక్సెల్‌ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.

ఈ ఫోన్‌లో 3000 ఎమ్‌ఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ కూడా అమర్చారు. ఇది గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ ఆధారంగా నడుస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ ప్లేపై స్పోర్ట్స్ వీక్షించొచ్చు. 

click me!