స్పోర్ట్స్ లవర్స్ కోసం మొదటి ప్రత్యేక ఛానెల్.. ఇప్పుడు అన్ని లైవ్ స్ట్రీమ్ లో చూడవచ్చు...

By asianet news teluguFirst Published Nov 17, 2023, 12:44 PM IST
Highlights

ఫ్యాన్‌కోడ్‌కి యాక్సెస్ పొందడానికి  అమెజాన్ ప్రైమ్ వీడియోకి సబ్‌స్క్రిప్షన్  ఉండాలి, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రూ. 249 నుండి  ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి వెస్టిండీస్‌లో జరిగే సూపర్ స్మాష్ అండ్  ఇంగ్లండ్ టూర్ కి కూడా యాక్సెస్ పొందుతారు.
 

అమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి  స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ఛానెల్  ఫ్యాన్‌కోడ్‌ని ప్రకటించింది. ఈ ఛానెల్ ద్వారా భారతీయ యూజర్లు  దేశీయ అండ్  వరల్డ్  స్పోర్ట్స్  లైవ్ గా చూడవచ్చు. కంపెనీ marquee sports leagues అండ్  సంస్థలతో పార్టీనర్షిప్ ఉంది. భారతదేశంలోని స్పోర్ట్స్  అభిమానులకు క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ, కబడ్డీ, బాస్కెట్‌బాల్, గుర్రపు పందెం వంటి 15  స్పోర్ట్స్ తీసుకువస్తామని పేర్కొంది.

ఫ్యాన్‌కోడ్‌కి యాక్సెస్ పొందడానికి  అమెజాన్ ప్రైమ్ వీడియోకి సబ్‌స్క్రిప్షన్  ఉండాలి, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రూ. 249 నుండి  ప్రారంభమవుతుంది. ఫ్యాన్‌కోడ్‌కి ICC పాత్‌వేస్, క్రికెట్ వెస్ట్ ఇండీస్, EFL, CONMEBOL, వాలీబాల్ వరల్డ్ & FIBAకి ప్రత్యేక రైట్స్  ఉన్నాయి. ప్రైమ్ సభ్యులు కారాబావో కప్, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్, FIFA U17 వరల్డ్ కప్, బార్క్లేస్ ఉమెన్స్ సూపర్ లీగ్, AFC ఛాంపియన్స్ లీగ్, AFC కప్ ఇంకా యువ కబడ్డీ  మరిన్ని  చూడవచ్చు.

ఈ ఏడాది చివరి నాటికి వెస్టిండీస్‌లో జరిగే సూపర్ స్మాష్ అండ్  ఇంగ్లండ్ టూర్ కి కూడా యాక్సెస్ పొందుతారు.

“ప్రైమ్ వీడియోలో మా ఎంటర్టైన్మెంట్  ప్రాధాన్యతలు దేశవ్యాప్తంగా విభిన్నంగా ఉన్నప్పటికీ, మనమందరం గొప్ప క్రీడాభిమానులమని మాకు తెలుసు! అన్ని రకాల స్పోర్ట్స్ కి  స్ట్రాంగ్, ఉద్వేగభరితమైన ఫ్యాన్స్  ఫాలోయింగ్ ఉంటుంది. మేము వివిధ రకాల క్రీడలకు యాక్సెస్ సులభతరం చేయాలనుకుంటున్నాము, ”అని ప్రైమ్ వీడియో ఛానెల్స్, ఇండియా హెడ్ - వివేక్ శ్రీవాస్తవ అన్నారు.

ముఖ్యంగా, గత 4 సంవత్సరాలలో, ఫ్యాన్‌కోడ్ 45,000 గంటల కంటే ఎక్కువ లైవ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను ప్రసారం చేసింది. ఫ్యాన్‌కోడ్‌తో పాటు ప్రైమ్ సభ్యులు ఫ్యాన్‌కోడ్, బిబిసి ప్లేయర్, బిబిసి కిడ్స్, యానిమాక్స్ + జిఇఎమ్, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, డాక్యుబే, మనోరమమాక్స్, హోయిచోయ్, ఎంయుబిఐ, VROTT, ఎకార్న్ టీవీ, నమ్మఫ్లిక్స్, స్టింగ్రే ఆల్ గుడ్ వైబ్స్, ఐవండర్, క్యూరియాసిటీ స్ట్రీమ్, చౌపాల్, మైజెన్ టీవీ, మ్యూజియం టీవీ, ఎఎమ్‌సి+, షార్ట్‌టివి సహా 22 OTT సర్వీసెస్ యాక్సెస్ చేయవచ్చు. 

ఫ్యాన్‌కోడ్ సహ-వ్యవస్థాపకుడు యానిక్ కొలాకో  ఈ సహకారం గురించి మాట్లాడుతూ  “ఫ్యాన్‌కోడ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రీడా అభిమానిని చేరుకోవాలని కోరుకుంటుంది. ప్రైమ్ వీడియోతో ఈ అనుబంధం ఆ దిశలో ఒక అడుగు. మా ప్రీమియం కంటెంట్‌ను ప్రైమ్ వీడియో ఛానెల్‌లకు తీసుకురావడానికి ఇంకా మా పరిధిని మరింత పెంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ సేవలో FanCode మొదటి స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ అవుతుందనే వాస్తవం ఈ సహకారాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది అని పేర్కొన్నారు

click me!