ఈ ఒక్కటి ఏ కారునైనా స్మార్ట్ కారుగా మారుస్తుంది: ఇంత తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్స్ కూడా..

By asianet news telugu  |  First Published Nov 7, 2023, 9:32 AM IST

మీరు ఇప్పుడు ఎలాంటి రీ-వైరింగ్ లేకుండానే ఈ స్మార్ట్ ఫీచర్లను మీ కారులో చూడొచ్చు. ఇందుకు జియోమోటివ్ డివైజ్  సరిపోతుందని రిలయన్స్ డిజిటల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
 


 భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో తాజాగా జియోమోటివ్ అనే  డివైజ్ ని విడుదల చేసింది. ఈ డివైజ్ పాకెట్-సైజ్ OBD (అవుట్‌ బౌండ్ డయలర్) , దీని ద్వారా నిమిషాల్లో ఏ కారునైనా స్మార్ట్ కార్‌గా మారుస్తుంది. పాత లేదా బేసిక్ మోడల్ కారును స్మార్ట్ కారుగా మార్చేందుకు దీనిని కారులో స్టాల్ చేసుకోవచ్చు.

ఈ రోజుల్లో చాలా ఫోన్స్, డివైజెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో వస్తున్నాయి. వీటి ద్వారా  వాహనదారులు వారి  కారు ఇంటర్నల్ హెల్త్  తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వీటిలో కార్ లొకేషన్, ఇంజిన్ కండిషన్,  డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. అయితే మీరు పాత లేదా బేసిక్  మోడల్ కొత్త వాహనాన్ని డ్రైవ్ చేస్తే చాలా ఫీచర్లు మిస్ అవుతాయి.

Latest Videos

undefined

కానీ, మీరు ఇప్పుడు ఎలాంటి రీ-వైరింగ్ లేకుండానే ఈ స్మార్ట్ ఫీచర్లను మీ కారులో చూడొచ్చు. ఇందుకు జియోమోటివ్ డివైజ్  సరిపోతుందని రిలయన్స్ డిజిటల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

జియో మోటివ్ ఫీచర్లు:

రియల్-టైం ట్రాకింగ్: మీ వాహన లొకేషన్, కదలికను పర్యవేక్షిస్తుంది. మీ వాహనాన్ని ఎవరైనా ఉపయోగిస్తునారా కూడా పర్యవేక్షిస్తుంది.

ఇ-సిమ్:  జియో సిమ్‌తో పాటు మీరు ఇప్పటికే కొన్న మొబైల్ డేటా ప్లాన్‌తో డేటాను షేర్ చేస్తుంది. దీని వాళ్ళ , మరొక SIM అవసరాన్ని తొలగిస్తుంది.

జియో-ఫెన్సింగ్ :  మ్యాప్‌లో వర్చువల్ బౌండరీస్ సెట్ చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుంది.

టైమ్ ఫెన్స్ : దీని వల్ల   సిమ్ హోల్డర్‌కు వారి కారు 'ఆన్' చేసిన ప్రతిసారీ నోటిఫికేషన్‌ను పంపుతుంది. ఇంకా వారికి తెలియకుండా నడపబడకుండా చూసుకోవడానికి సహాయపడుతుంది.

డ్రైవింగ్ అనలిటిక్స్ : JioMotive డివైజ్ కారు స్పీడ్, బ్రేకింగ్ ఇంకా మరిన్ని వంటి డేటాను సేకరిస్తుంది. డ్రైవింగ్ ప్రాక్టీస్‌ని మెరుగుపరచడానికి దీని వల్ల   ఉపయోగపడుతుంది.

రిమోట్ డయాగ్నస్టిక్స్: ఈ డివైజ్ తీవ్రమైన సమస్యలను నివారించడానికి కారు హెల్త్, పనితీరు ఇంకా హెచ్చరికలను ముందుగానే అందిస్తుంది. అలాగే కారు నిర్వహణ ఖర్చును తగ్గించడంలో ఇంకా కారు జీవితకాలాన్ని పొడిగించడంలో ఉపయోగపడుతుంది.

జియోమోటివ్ ధర:  రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో జియోమోటివ్ బేస్ ధర రూ. 11,999. కానీ, ప్రస్తుతం 58% తగ్గింపు అంటే రూ.4,999కే  అందుబాటులో  ఉంది. 

click me!