తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోస్ కోసం ఇంటర్నల్ అల్గారిథమ్‌లతో అమర్చబడి ఈ USB వెబ్‌క్యామ్ ఉందని రిలయన్స్ జియో పేర్కొంది. ఈ వెబ్‌క్యామ్ ని JioTVCalling అండ్ JioMeet అప్లికేషన్‌లతో ఉపయోగించవచ్చు. ఇంకా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మొదలైన ఇతర ప్రముఖ అప్లికేషన్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
రిలయన్స్ జియో కస్టమర్లు టీవీ నుండి నేరుగా వీడియో కాల్స్ చేయడానికి JioTVCamera అనే USB వెబ్‌క్యామ్‌ని ఉపయోగించవచ్చు. Jio USB వెబ్‌క్యామ్ లాంగ్ -రేంజ్ ఆడియోతో పాటు అల్ట్రా-వైడ్ HD వీడియోను అందిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రైవసీ షట్టర్‌తో కూడా వస్తుంది.
దీనికి 120-డిగ్రీల వ్యూ ఫీచర్ ఉంది, ఇంకా వైడ్ వ్యూ అందిస్తుంది. వైడ్ యాంగిల్ వ్యూ పెద్ద ఫ్యామిలి కాల్స్, గ్రూప్ మీటింగ్స్ ఇంకా పర్సనల్ సమావేశాలకి సహాయపడుతుంది. ఈ వెబ్‌క్యామ్ స్పెషల్ ఫీచర్స్ లో ఒకటి ఇంటర్నల్ మైక్రోఫోన్. ప్రోడక్ట్ లిస్ట్ ప్రకారం 4 మీటర్ల దూరం నుండి ఆడియోను స్పష్టంగా రిసీవ్ చేసుకోగలదు.
తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోస్ కోసం ఇంటర్నల్ అల్గారిథమ్‌లతో అమర్చబడి ఈ USB వెబ్‌క్యామ్ ఉందని రిలయన్స్ జియో పేర్కొంది. ఈ వెబ్‌క్యామ్ ని JioTVCalling అండ్ JioMeet అప్లికేషన్‌లతో ఉపయోగించవచ్చు. ఇంకా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మొదలైన ఇతర ప్రముఖ అప్లికేషన్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
JioTV కెమెరా ప్రైవసీ షట్టర్‌తో వస్తుంది, వెబ్‌క్యామ్ ఉపయోగంలో లేనప్పుడు మీ ప్రైవసీ రక్షిస్తూ మీకు మనశ్శాంతిని అందిస్తుంది.
Jio USB వెబ్‌క్యామ్‌ని Jio TVని ఉపయోగించి వీడియో కాల్స్ చేయడానికి USB ఇంటర్‌ఫేస్ ద్వారా వెబ్‌క్యామ్‌ను మీ టీవీకి కనెక్ట్ చేయండి. కనెక్ట్ అయిన తర్వాత, మీరు వీడియో కాల్స్ చేయడానికి JioTVCalling లేదా JioMeet అప్లికేషన్‌లను ఓపెన్ చేసి ఉపయోగించవచ్చు.
జియో USB వెబ్‌క్యామ్ రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్‌లో రూ. 2,999 ధరకు కొనవచ్చు. దీనికి 1-సంవత్సరం కంపెనీ వారంటీతో వస్తుంది. Jio సెట్-టాప్ బాక్స్‌లోని JioJoin యాప్‌ని ఉపయోగించి JioTVCamera టీవీ ద్వారా ఫుల్ స్క్రీన్ వీడియో కాల్స్ చేయవచ్చు.
JioTVCameraని సెటప్ చేయడానికి, ఈ క్రింది స్టెప్స్ పాటించండి:
1. USB ద్వారా సెట్-టాప్ బాక్స్‌కు మీ కెమెరాను కనెక్ట్ చేయండి, ఇప్పుడు సెట్-టాప్ బాక్స్‌ను రీబూట్ చేయండి
2. JioJoin అప్లికేషన్‌ను ఓపెన్ చేసి పర్మిషన్స్ ఒకే చేయండి
3. ̄ఒకే చేసిన తర్వాత, కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని 'OTP జనరేట్' అని అడుగుతుంది .
4. మీరు 'జనరేట్ OTP'పై క్లిక్ చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి OTP వస్తుంది.
5. అందుకున్న OTPని ఎంటర్ చేసి 'ప్రొసీడ్' పై క్లిక్ చేయండి.
6. మీ జియో సెట్-టాప్ బాక్స్ మీ 10-అంకెల జియో ఫిక్స్‌డ్ వాయిస్ నంబర్‌తో కాన్ఫిగర్ చేయబడుతుంది.