Amazon Holi offer:వాటర్‌ప్రూఫ్ గాడ్జెట్‌లపై 60% వరకు భారీ తగ్గింపు, ఇయర్‌బడ్స్‌ నుండి కెమెరా వరకు తక్కువ ధరకే

Ashok Kumar   | Asianet News
Published : Mar 16, 2022, 05:01 PM IST
Amazon Holi offer:వాటర్‌ప్రూఫ్ గాడ్జెట్‌లపై 60% వరకు భారీ తగ్గింపు, ఇయర్‌బడ్స్‌ నుండి కెమెరా వరకు తక్కువ ధరకే

సారాంశం

హోలీ  సందర్భంగా  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో హోలీ స్పెషల్ సేల్ నిర్వహించబడింది, దీనిలో వాటర్‌ప్రూఫ్ గాడ్జెట్‌లపై 60 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది. అమెజాన్ 'హోలీ షాపింగ్ స్టోర్'ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు.

హోలీ  పండుగ ప్రత్యేక సందర్భంగా అమెజాన్ ఇండియాలో హోలీ స్పెషల్ సేల్ నిర్వహిస్తుంది, దీనిలో వాటర్‌ప్రూఫ్ గాడ్జెట్‌లపై 60 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. అమెజాన్ 'హోలీ షాపింగ్ స్టోర్'ని ప్రవేశపెట్టడం ఇదేం మొదటిసారి కాదు. అమెజాన్ ప్రతి పండుగల సందర్భంగా ఇలాంటి సేల్స్ నిర్వహిస్తుంది. ఈ Amazon సేల్‌లో JBL, Noise, boAt, GoPro, Insta360 వంటి బ్రాండ్‌ల  కెమెరాలు, హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు, వెరబుల్ అన్ని వాటర్‌ప్రూఫ్ గాడ్జెట్‌లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం....

హోలీ షాపింగ్ స్టోర్: కెమెరా
ఈ సేల్‌లో మీరు ప్రత్యేకంగా హోలీ కోసం GoPro HERO10 యాక్షన్ కెమెరాను కొనుగోలు చేయవచ్చు. ఇది యాక్షన్ కెమెరా కాబట్టి మీరు ఎలాంటైన యాక్షన్ లేదా స్పొర్ట్స్ కవర్ చేయవచ్చు. దీనిలో GP2 శక్తివంతమైన ఇంజన్‌ ఉంది, ఇంకా బెస్ట్ ఫోటోగ్రఫీగా ఇస్తుంది క్లెయిమ్ చేయబడింది. ఈ కెమెరా పూర్తిగా వాటర్ ప్రూఫ్ కాబట్టి మీరు హోలీ రంగులకు భయపడాల్సిన అవసరం లేదు.

Insta360 ONE R ట్విన్ ఎడిషన్
ఇది కూడా గొప్ప కెమెరా. దీనిలో డ్యూయల్ 360 డిగ్రీ మోడ్ ఇచ్చారు. ఈ కెమెరాతో మీరు 5.7K రిజల్యూషన్‌లో వీడియోలు,  ఫోటోలను క్లిక్ చేయవచ్చు. ఇది H.265 ఎన్‌కోడింగ్‌తో కూడి ఉంటుంది. ఈ కెమెరాతో మీరు AI సపోర్ట్ కూడా పొందుతారు. హోలీకి ఈ కెమెరా మీ బెస్ట్ గాడ్జెట్ కావచ్చు.

Insta360 ONE X2 యాక్షన్ కెమెరా
వన్ ఎక్స్2  (ONE X2) అనేది తక్కువ లైట్ లో మంచి ఫోటోలను క్లిక్ చేయడంలో ప్రత్యేకత ఉన్న యాక్షన్ కెమెరా. సౌండ్ లేకుండా ఈ కెమెరాతో తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయవచ్చు. దీని బాడీ కఠినమైనది, కాబట్టి మీరు నీటికి లేదా రంగుకు భయపడాల్సిన అవసరం లేదు. 10 మీటర్ల లోతు నీటిలో ముంచినా ఈ కెమెరా పాడైపోదు. నీటిలో షూటింగ్ కోసం, ఆక్వావిజన్ మోడ్ ఇందులో ఇచ్చారు.

హోలీ షాపింగ్ స్టోర్: హెడ్‌ఫోన్‌లు
నాయిస్ బడ్స్ VS103- దీనితో మీరు 4.5 గంటల బ్యాకప్ పొందుతారు, దీని ఛార్జింగ్ కేస్‌ 18 గంటల వరకు బ్యాక్ అప్ ఉంటుంది. ఇందులో ఫాస్ట్ పెయిరింగ్ కోసం హైపర్ సింక్ టెక్నాలజీ ఇచ్చారు. మీరు దీన్ని హోలీ సేల్‌లో రూ. 1,499కి కొనుగోలు చేయవచ్చు.

boAt Airdopes 441- హోలీ సేల్  సమయంలో ఇది కూడా మీ బెస్ట్ గాడ్జెట్‌లలో ఒకటి కావచ్చు. దీనికి వాటర్ రెసిస్టెంట్ కోసం IPX7 రేటింగ్ పొందింది. అలాగే భారీగా బాస్ ఇస్తుంది క్లెయిమ్ చేశారు. ఇంకా 6mm డైనమిక్ డ్రైవర్‌ ఉంది. అమెజాన్ హోలీ సేల్‌లో దీన్ని రూ. 1,999కి కొనుగోలు చేయవచ్చు. 

మీరు హోలీ స్పెషల్ సేల్‌లో JBL Go 2, బోట్ స్టోన్ Grenade 5W, బోట్  స్టోన్ Marvel Edition వంటి వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్‌లను కొనుగోలు చేయవచ్చు. వేరబుల్స్ కేటగిరీలో Alexa సపోర్ట్‌తో కూడిన boAt Xtend స్మార్ట్‌వాచ్, Noise ColorFit Pulse Grand వంటి స్మార్ట్‌వాచ్‌లు మీ కొనుగోలు లిస్ట్ లో చేరవచ్చు.

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా