నేడు స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జి ఫస్ట్ సేల్.. లాంచింగ్ ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ కూడా..

Ashok Kumar   | Asianet News
Published : Mar 16, 2022, 03:31 PM IST
నేడు స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జి  ఫస్ట్ సేల్.. లాంచింగ్ ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ కూడా..

సారాంశం

గెలాక్సీ ఎఫ్23 5జి 6.6-అంగుళాల పూర్తి HD+ ఇన్ఫినిటీ డిస్ ప్లేతో  వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5  ప్రొటెక్షన్ కూడా ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్, 6జి‌బి వరకు ర్యామ్, 6జి‌బి వరకు వర్చువల్ ర్యామ్ తో 128జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది.  

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎఫ్ సిరీస్ ఫోన్  స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23(Samsung Galaxy F23)5Gని గత వారం  భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే దీనిని గత సంవత్సరం ప్రవేశపెట్టిన  గెలాక్సీ ఎఫ్22(Galaxy F22)కి అప్‌గ్రేడ్ వెర్షన్. స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23 5Gని మొదటిసారిగా  అంటే మార్చి 16న కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. ఇందులో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23 5G  మరో విశేషం ఏమిటంటే 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే లభిస్తుంది. ఈ ఫోన్  భారతీయ మార్కెట్లో రెడ్ మీ నొత్ 11టి 5G, iQoo Z3, Realme 9 Pro 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

 ధర
స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23 5G 4జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 17,499. 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,499. ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్ లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, సామ్‌సంగ్ సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ ఆఫర్ కింద ఫోన్ రెండు వేరియంట్‌లను రూ.15,999 అలాగే రూ.16,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌తో రూ.1,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా, యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా రెండు నెలల పాటు ఫోన్‌తో లభిస్తుంది.

 స్పెసిఫికేషన్‌లు
స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23 5Gలో Android 12 ఆధారిత One UI 4.1 ఉంది. ఈ ఫోన్‌కు రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని కంపెనీ హామీ ఇచ్చింది.

6.6-అంగుళాల పూర్తి HD+ ఇన్ఫినిటీ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5  ప్రొటెక్షన్, ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్, 6జి‌బి వరకు ర్యామ్, 6జి‌బి వరకు వర్చువల్ ర్యామ్ తో 128జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.

ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రాథమిక లెన్స్ 50-మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 సెన్సార్,  aperture f/1.8 ఉంది. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ కోసం 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/A-GPS, NFC, USB టైప్-C,3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో కూడిన డాల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ అందించారు.

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా