మార్కెట్లో రోజురోజుకు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇక షావోమీ నుంచి ఎన్నో ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి 12 సిరీస్ (Xiaomi 12 Series) కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. గత ఏడాదిలో మార్కెట్లో లాంచ్ అయిన Mi 11 సిరీస్‌కు ఇది అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్.. టాప్ ఎండ్ స్పెషిఫికేషన్లతో రెండు మెయిన్ (Xiaomi 12 Series, Xiaomi 12Pro Seris) వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌తో పాటు Xiaomi Watch S1 సిరీస్, Buds 3Tpro ఇయర్‌ఫోన్‌లను కూడా రిలీజ్ చేసింది. కానీ, అల్ట్రా మోడల్ రిలీజ్ చేయలేదు. కానీ, రెగ్యులర్ మోడల్ టోన్డ్-డౌన్ వెర్షన్ Xiaomi 12X ఫోన్ మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది. ప్రస్తుతానికి భారత మార్కెట్లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది క్లారిటీ లేదు. గత ఏడాదిలో Xiaomi భారత మార్కెట్లో Xiaomi 11 సిరీస్ అల్ట్రా మోడల్‌ను మాత్రమే రిలీజ్ చేసింది. కానీ, Xiaomi 12 Ultra మోడల్ మాత్రం లాంచ్ చేయలేదు.
Xiaomi 12 Pro మోడల్.. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. కేవలం 18 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ Xiaomi పేర్కొంది. 6.73-అంగుళాల పరిమాణంలో కర్వ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. LTPO OLED ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది. 1440px రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ స్ట్రాంగ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రోటెక్ట్ చేస్తుంది. షావోమీ 12 సిరీస్ ఫోన్ కిందిభాగంలో హై-ఎండ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 zen 1 (Snapdragon 8 Gen 1 SoC) చిప్‌సెట్ అమర్చారు.
undefined
అంతేకాదు.. ఈ డివైజ్ గరిష్టంగా 256GB స్టోరేజీ ఆప్షన్‌తో వచ్చింది. Xiaomi 12 Pro 4,600mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఈ డివైజ్‌ను 50W ఛార్జర్‌తో వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయవచ్చు. Xiaomi నాలుగు-యూనిట్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది, దీనిని హర్మాన్ కార్డాన్ ట్యూన్ చేశారు. Xiaomi 12 Pro డివైజ్‌లో కెమెరా సిస్టమ్ మూడు 50-MP సెన్సార్లను కలిగి ఉంది. 1/1.28-అంగుళాల సోనీ IMX707 సెన్సార్. అందులో ఒకటి 115-డిగ్రీల అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా కలిగి ఉంది. మరొకటి 2x టెలిఫోటో కెమెరాతో ఆకర్షణీయంగా ఉంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32-MP కెమెరాను అమర్చారు.
Xiaomi 12 బేస్ మోడల్ విషయానికొస్తే.. డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.28-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Xiaomi చౌకైన ధరకే ఈ మోడల్ అందిస్తోంది. ఇందులో 4,500mAh బ్యాటరీ యూనిట్ చాలా చిన్నదిగా ఉంటుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు.. టెక్ హై-ఎండ్ మోడల్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. Xiaomi12 మోడల్ ఫోన్.. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మాత్రమే వస్తుంది. కంపెనీ 50W వైర్‌లెస్ 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.
Xiaomi 12 సిరీస్ (128GB స్టోరేజ్) మోడల్ ప్రారంభ ధర $749 (రూ. రూ. 57,210)గా ఉండనుంది. Xiaomi 12 సిరీస్ ఫోన్ చైనాలో ప్రారంభ ధర CNY 3,699లకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో దాదాపు రూ. 44,300గా ఉంటుంది. మరోవైపు Xiaomi 12 Pro ధర $999 (దాదాపు రూ. 76,310) వరకు ఉంటుంది. Xiaomi 256GB స్టోరేజ్ మోడల్ ధర కూడా రూ.76,310లకు కొనుగోలు చేయొచ్చు. Xiaomi 12X చౌకైన మోడల్ (8GB RAM + 128GB) స్టోరేజ్ వేరియంట్ ధర $649 (దాదాపు రూ. 49,600)కి అందుబాటులో ఉంది.