50 మెగాపిక్సెల్ కెమెరాతో స్యామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచింగ్ ఆఫర్ కింద క్యాష్‌బ్యాక్ కూడా..

స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ధర రూ.13,499. ఈ ధరలో 4జి‌బి  ర్యామ్ తో 64జి‌బి స్టోరేజ్ ఇచ్చారు. స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ని బ్లాక్, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు. 


స్యామ్సంగ్ ఇండియాలో స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ని లాంచ్ చేసింది. Exynos 850 ప్రాసెసర్ స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ తో ఇచ్చారు. అంతేకాకుండా  6.5-అంగుళాల డిస్ ప్లే లభిస్తుంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది.  4G సపోర్ట్ తో ఈ సామ్‌సంగ్ ఫోన్‌ డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది.

 ధర
స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ధర రూ.13,499. ఈ ధరలో 4జి‌బి  ర్యామ్ తో 64జి‌బి స్టోరేజ్ ఇచ్చారు. స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ని బ్లాక్, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు. సామ్‌సంగ్ సైట్ అండ్ రిటైల్ స్టోర్ల ద్వారా ఫోన్ సేల్స్ ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ కింద, మీరు ఎస్‌బి‌ఐ బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే రూ. 1,000 క్యాష్‌బ్యాక్ పొందుతారు.

Latest Videos

స్పెసిఫికేషన్‌లు
స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ Android 12తో UI కోర్ 4.1 ఉంది. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది Exynos 850 ప్రాసెసర్‌తో 4జి‌బి ర్యామ్, 4 జి‌బి వర్చువల్ ర్యామ్‌ కూడా ఉంది.

 కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు, ఎపర్చరు f/1.8 ఉంది. రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో, సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

 బ్యాటరీ
డాల్బీ అట్మోస్ ఆడియోకి స్యామ్సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5, GPS / A-GPS ఉంది. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ Samsung ఫోన్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఇచ్చారు.

click me!