నోకియా టి21 ట్యాబ్ ని గ్రే కలర్‌లో పరిచయం చేసారు. 4జిబి ర్యామ్ ట్యాబ్‌తో 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 32,99,000 ఇండోనేషియన్ అంటే 17 వేల రూపాయలు.
హెచ్‌ఎండి గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా కంపెనీ కొత్త టాబ్లెట్ నోకియా టి21 ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్ మొదట ఇండోనేషియాలో తాజాగా ట్యాబ్ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. నోకియా టి21 UNISOC T612 ప్రాసెసర్ అండ్ 10.36-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్ ప్లే సపోర్ట్ తో వస్తుంది. ట్యాబ్‌లో 4 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 512జిబి వరకు పెంచుకోవచ్చు.
నోకియా టి21 ధర
నోకియా టి21 ట్యాబ్ ని గ్రే కలర్‌లో పరిచయం చేసారు. 4జిబి ర్యామ్ ట్యాబ్‌తో 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 32,99,000 ఇండోనేషియన్ అంటే 17 వేల రూపాయలు. ఈ ట్యాబ్ గ్లోబల్ మార్కెట్‌లో సుమారు రూ. 19,000 ధరతో పరిచయం చేశారు.
undefined
నోకియా T21 స్పెసిఫికేషన్లు
నోకియా T21 10.36-అంగుళాల IPS LCD డిస్ ప్లే పొందుతుంది, 2000 x1200 పిక్సెల్స్ రిజల్యూషన్, 400 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. UNISOC T612 ప్రాసెసర్‌తో Nokia T21లో Mali-G57 గ్రాఫిక్స్‌కు సపోర్ట్ ఉంది. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12లో నడుస్తుంది ఇంకా కంపెనీ రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.
అంటే, మీరు ఆండ్రాయిడ్ 12తో పాటు ఆండ్రాయిడ్ 13 అండ్ ఆండ్రాయిడ్ 14కి కూడా అప్ డేట్ కావొచ్చు. ఈ ట్యాబ్ లో 4జిబి ర్యామ్ తో 128జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు. అయితే, కంపెనీ దీనిని ఇండోనేషియాలో 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌లో మాత్రమే విడుదల చేసింది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 512జిబి వరకు పెంచుకోవచ్చు.
నోకియా T21 కెమెరా
నోకియా T21 కెమెరా గురించి మాట్లాడితే సింగిల్ బ్యాక్ కెమెరా 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ట్యాబ్‌లో సెల్ఫీలు అండ్ వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్ సపోర్ట్ కూడా అందించారు.
నోకియా T21 బ్యాటరీ
నోకియా T21లో 8200 mAh బ్యాటరీ అందించారు. ఇంకా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Nokia T21లో కనెక్టివిటీ కోసం NFC, స్టీరియో స్పీకర్, 3.5mm జాక్ ఉంది. టాబ్లెట్ దుమ్ము, వాటర్ రిసిస్టంట్ కోసం IP52 రేటింగ్ పొందుతుంది.