5G Service In India: సెప్టెంబర్ నుండి 5జి సేవలు ప్రారంభం.. భారీగా ఉద్యోగాలు.. త్వరలో స్పెక్ట్రమ్ వేలం

Ashok Kumar   | Asianet News
Published : May 19, 2022, 01:39 PM IST
5G Service In India: సెప్టెంబర్ నుండి 5జి సేవలు ప్రారంభం..  భారీగా ఉద్యోగాలు.. త్వరలో స్పెక్ట్రమ్ వేలం

సారాంశం

5జీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలిసిస్ వంటి కొత్త టెక్నాలజీ పాత్రల్లో 1.5 లక్షల మంది నిపుణులకు డిమాండ్ ఉందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తెలిపింది. ఈ రంగంలో డిమాండ్ ఇంకా సప్లయి మధ్య 28 శాతం అంతరాయం ఉంది.

ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నుండి దేశంలో స్వదేశీ 5జి సేవ ప్రారంభమవుతుంది. 5G ద్వారా 1.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. 5జీ సేవల కోసం దాదాపు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్  తెలిపారు. ఈ సర్వీస్ ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ప్రారంభమవుతుంది. 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక వృద్ధిలో టెక్నాలజి కీలక పాత్ర పోషిస్తున్న ప్రపంచంలో డిజిటల్ విభజనను తగ్గించడం మరింత ముఖ్యమైనదిగా మారిందని అన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా  వృద్ధిని నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

ఈ టెక్నాలజీ మంచిదని, తక్కువ ఖర్చుతో నాణ్యమైనదని ఆయన హామీ ఇచ్చారు. భారతదేశంలోని 13 నగరాలు ప్రారంభ దశలో 5G సేవలను ప్రారంభించనున్నాయని TRAI ఛైర్మన్ PD వాఘేలా తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

ఈ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు
 భారత్ నెట్ నుంచి స్పేస్ కమ్యూనికేషన్, 5జీ నుంచి ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వరకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు టెలికాం సెక్రటరీ కె రాజారామన్ తెలిపారు. ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయి. త్వరలో మేము పాలసీ అడ్డంకులను తొలగిస్తామని ఆశిస్తున్నాము.

కౌన్సిల్‌లో లక్ష మందికి శిక్షణ 
5జీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలిసిస్ వంటి కొత్త టెక్నాలజీ పాత్రల్లో 1.5 లక్షల మంది నిపుణులకు డిమాండ్ ఉందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తెలిపింది. ఈ రంగంలో డిమాండ్ ఇంకా సప్లయి మధ్య 28 శాతం అంతరాయం ఉంది, ఇది పెరుగుతూనే ఉంటుంది. 5జీ సేవల కోసం మండలి 3 ఏళ్లలో లక్ష మందికి శిక్షణ ఇవ్వనుంది.
 

PREV
click me!

Recommended Stories

Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే
OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్