ప్రీపెయిడ్ యూజర్లకు సూపర్ ఆఫర్.. ఫ్రీగా 2జి‌బి డాటా.. ఎలా పొందాలంటే..?

Ashok Kumar   | Asianet News
Published : May 18, 2022, 06:41 PM IST
ప్రీపెయిడ్ యూజర్లకు సూపర్ ఆఫర్.. ఫ్రీగా 2జి‌బి డాటా.. ఎలా పొందాలంటే..?

సారాంశం

డేటా డిలైట్ ఆఫర్ కింద, కస్టమర్లు ప్రతి నెలా 2జి‌బి ఉచిత డేటాను పొందవచ్చు. అంతేకాకుండా, బింగ్ అల్ నైట్ అందుబాటులో ఉంటుంది, అంటే రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు.

వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) (Vi)  ఎన్నో ఆన్ లిమిటెడ్  ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల కోసం డేటా డిలైట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కొత్త ఆఫర్ ప్రకారం, Vodafone Idea కస్టమర్లు 2జి‌బి వరకు డేటాను ఉచితంగా అందిస్తుంది, అయితే ఈ ఆఫర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేయబడదు. దీన్ని ఆక్టివేట్ చేయడానికి కస్టమర్‌లు వోడాఫోన్ ఐడియా నంబర్ నుండి 121249కి డయల్ చేయాల్సి ఉంటుంది. Vi మొబైల్ యాప్ ద్వారా కూడా ఆఫర్‌ని ఆక్టివేట్ చేసుకోవచ్చు.

Vi  అన్‌లిమిటెడ్ హీరో ప్లాన్ ప్రారంభ ధర రూ. 299. అంతేకాకుండా ఈ ఆఫర్ రూ. 359, రూ. 409, రూ. 475 ప్లాన్‌లతో కూడా అందుబాటులో ఉంది. డేటా డిలైట్ ఆఫర్ కింద కస్టమర్లు ప్రతి నెలా 2జి‌బి ఫ్రీ డేటాను పొందవచ్చు.  ఇంకా Binge All Night అందుబాటులో ఉంటుంది, అంటే రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

కొత్త ఆఫర్‌లో వీకెండ్ డేటా రోల్‌ఓవర్ కూడా ఉంది. వారం మొత్తంలో మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో ఉపయోగించుకోవచ్చు. Vodafone Idea తాజాగా రూ. 82  యాడ్ ఆన్ ప్యాక్‌ను పరిచయం చేసింది, ఇందులో వినియోగదారులు 28 రోజుల వాలిడిటీతో SonyLIV ప్రీమియం  సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

గత నెలలో Vi రూ 98, రూ 195, రూ 319 ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను 31 రోజుల వరకు వాలిడిటీతో పరిచయం చేసింది. ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు   ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం, గరిష్టంగా 2జి‌బి డేటా లభిస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?