వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.20.10 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇక యానిమేటెడ్ స్టిక్కర్‌లు త్వరలో రావొచ్చు అని తెలుస్తుంది.
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో అత్యధికంగా ఎక్కువ మంది వాడేది వాట్సాప్. ఫేస్ బుక్ యజమానయంలో పని చేసే వాట్సాప్ ఎప్పుడు ఒక కొత్త ఫీచర్ ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఇందుకోసం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.20.10 అప్‌డేట్‌ను విడుదల చేసింది.
ఇక యానిమేటెడ్ స్టిక్కర్‌లు త్వరలో రావొచ్చు అని తెలుస్తుంది. వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్‌లు మూడీ ఫుడీస్, బ్రైట్ డేస్, రికోస్ స్వీట్ లైఫ్, ప్లేఫుల్ పియోమారు ఇంకా మరెన్నో కొత్త స్టిక్కర్ ప్యాక్‌లను రానున్నాయి.డబ్లుఏ బెటా ఇన్ఫో నివేదిక ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతుంది.
undefined
also read ఇండియాకి మరో గిఫ్ట్ ఇచ్చిన అమెజాన్ సిఈఓ...
కొత్త యానిమేటెడ్ ప్యాక్‌లను యాప్ బీటా వెర్షన్‌లో యాక్సెస్ చేయలేరు.వాట్సాప్‌లోని యానిమేటెడ్ స్టిక్కర్లు ఎలా ఉంటాయో అనే ఒక చిన్న వీడియోను కూడా విడుదల చేసింది.ఒక నివేదిక ప్రకారం వాట్సాప్ దాని ప్రస్తుత స్టిక్కర్ల కోసం ఒక అప్ డేట్ విడుదల చేసింది.
కాని అప్ డేట్ స్టిక్కర్ల రూపాన్ని లేదా ఫీచర్ల పరంగా ఎటువంటి మార్పులను తీసుకువచ్చినట్లు కనిపించడం లేదు. అయితే వాట్సాప్ ఒక పెద్ద అప్ డేట్ ను ఆవిష్కరించడానికి బహుశా సన్నద్ధమవుతుందని తెలుస్తుంది.వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్‌ల కోసం ‘మూడీ ఫుడీస్’, ‘బ్రైట్ డేస్’, ‘రికోస్ స్వీట్ లైఫ్’, ‘ప్లేఫుల్ పియోమారు’ అలాగే ఇంకా మరిన్ని కొత్త స్టిక్కర్ ప్యాక్‌లు ఆడ్ అవుతాయని ఒక నివేదిక పేర్కొంది.
also read హువావే చీఫ్ ఆఫీసర్ విడుదలపై సంచలన తీర్పు...
ప్రస్తుతానికి యానిమేటెడ్ స్టిక్కర్లు ఎప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయి అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.వాట్సాప్ ప్లాట్‌ఫాం దాని స్వంత స్టిక్కర్‌లను చాలా తక్కువ జోడించినప్పటికీ, ఇది థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇది మెసేజింగ్ యాప్ లో మాత్రమే ఉపయోగపడుతుంది.
వాట్సాప్ స్టిక్కర్లు అనేది చాలా పాపులర్ ఫీచర్. ముఖ్యంగా పండుగల సంధర్భాలలో చాలా మంది దానిని ఉపయోగించుకుంటారు. యానిమేటెడ్ స్టిక్కర్లే కాకుండా, వాట్సాప్ డార్క్ మోడ్ చాలా కాలంగా అందరూ ఎంతో ఎదురుచూస్తున్న మరో గొప్ప ఫీచర్.ఈ ఫీచర్ అభివృద్ధి చివరి దశలో ఉందని, త్వరలో ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్‌ల కోసం విడుదల కానుందని తెలిపింది.వాట్సాప్ ఇంకా కొత్త ఫీచర్లను కూడా తిసుకు వస్తుందని డబ్లూఏ బెటా ఇన్ఫో నివేదించింది.