రిలయన్స్ జియో ఫైబర్ స్పెషల్ ఆఫర్.. ఎక్కువ కంటెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్..

By Sandra Ashok Kumar  |  First Published Jun 27, 2020, 6:18 PM IST

రిలయన్స్ జియోఫైబర్ చందాదారులందరికీ జీ5 కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. సిల్వర్ త్రైమాసిక ప్లాన్ లేదా అంతకంటే పై ప్లాన్ ఎంచుకున్న ప్రస్తుత, కొత్త జియో ఫైబర్ కస్టమర్లందరికి ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.


టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దాని జియో ఫైబర్ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన్ ఆఫర్ ప్రకటించింది.  జియో సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగిస్తున్న  వారికోసం జీ5 సబ్‌స్క్రిప్షన్‌ను ఇవ్వడమే కాకుండా, రిలయన్స్ జియో తన నెలవారీ గోల్డ్  సబ్‌స్క్రైబర్స్ కోసం కొత్త ప్రయోజనాలను కూడా ప్రవేశపెట్టింది.

రిలయన్స్ జియోఫైబర్ చందాదారులందరికీ జీ5 కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. సిల్వర్ త్రైమాసిక ప్లాన్ లేదా అంతకంటే పై ప్లాన్ ఎంచుకున్న ప్రస్తుత, కొత్త జియో ఫైబర్ కస్టమర్లందరికి ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. అంతేకాదు జియోఫైబర్ వినియోగదారులందరూ మూడు నెలలు లేదా ఆన్యువల్ సిల్వర్ ప్లాన్ తో రీఛార్జి చేసుకున్నవారికి జియో జీ5 ప్రీమియం కంటెంట్‌కు అక్సెస్ పొందుతారని తెలిపింది.

Latest Videos

undefined

also read అచ్చం టిక్‌టాక్‌లాగే యూట్యూబ్ సరికొత్త ఫీచర్..

గోల్డ్ ప్లాన్ చందాదారులకు జీ5 ప్రీమియం కంటెంట్‌కు కూడా అక్సెస్  లభిస్తుంది. నెల ప్లాన్ కు సంబంధించినంతవరకు నెలవారీ సిల్వర్ ప్లాన్‌కు సభ్యత్వం పొందిన కొత్త జియోఫైబర్ వినియోగదారులకు మాత్రమే మొదటి మూడు రీఛార్జ్‌లపై  జీ5 ప్రీమియం కంటెంట్‌కు అక్సెస్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

జీ5 సభ్యత్వంలో కంపెనీ లైబ్రరీ ప్రీమియం కంటెంట్ మొత్తం 12 భాషల్లో, 1.25 లక్షల ఆన్-డిమాండ్ కంటెంట్ , 100 కి పైగా టివి ఛానెల్స్, ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ మూవీస్, టివి షోలు, మ్యూజిక్, పిల్లల కంటెంట్ యాక్సెస్ లబిస్తుంది. సిల్వర్ త్రైమాసిక, ఆపై ప్లాన్‌లలో జియో ఫైబర్ వినియోగదారులు జీ 5 ప్రీమియం కంటెంట్‌కు  అర్హులు.  

మరింత ప్రీమియం కంటెంట్‌ కోసం చూస్తున్న వినియోగదారులు ప్రీమియం ఓటీటీ సేవలు, అధిక వేగం, ఎక్కువ బ్రాడ్‌బ్యాండ్ డేటాను అందించే గోల్డ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
 

click me!