రూ .10వేల లిమిట్ వరకు వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగపడే కొత్త రకం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పిపిఐ) ప్రవేశపెట్టాలని ఆర్‌బిఐ ప్రతిపాదించింది. బిల్ పేమెంట్, బిజినెస్ పేమెంట్ వంటి డిజిటల్ పేమెంట్ చేయడానికి మాత్రమే పిపిఐ ఉపయోగించుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తన స్టేట్మెంట్ ఆన్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలో రూ .10వేల వరకు పరిమితితో కొత్త రకం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పిపిఐ) ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.పాలసీ స్టేట్మెంట్ ప్రకారం డిజిటల్ పేమెంట్ ప్రోత్సహించడంలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐ) ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆర్బిఐ తెలిపింది.
డిజిటల్ పేమెంట్ వినియోగాన్ని మరింత సులభతరం చేయడానికి కొత్త రకం పిపిఐని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఇది రూ .10వేల పరిమితి వరకు వస్తువుల కొనుగోలుకు, ఏదైనా సర్విస్ కు ఉపయోగపడుతుంది. బిల్ పేమెంట్, బిజినెస్ పేమెంట్ వంటి డిజిటల్ పేమెంట్ చేయడానికి మాత్రమే పిపిఐ ఉపయోగించుకోవచ్చు.
undefined
aslo read ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసా...?
1 పే సిఈఓ, సహ వ్యవస్థాపకుడు అభిజీత్ మాట్లాడుతూ పిపిఐలపై ఆర్బిఐ ఆదేశం సరైనది, ముఖ్యంగా పిపిఐల కోసం సూచించిన ప్రస్తుత కెవైసి నిబంధనలు వారి పెరుగుదలకు తీవ్రమైన అవరోధంగా ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. పూర్తిగా కేవైసి కంప్లైంట్ బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే డబ్బు లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ గా రీఛార్జ్, లావాదేవీలను అనుమతిస్తుంది.
పిపిఐతో వస్తువులు ఏదైనా కొనడానికి అలాగే స్నేహితుడికి, కుటుంబానికి డబ్బును ట్రాన్సఫర్ చేయడానికి ఉపయోగించవచ్చు. కొన్ని ప్రముఖ పిపిఐలలో పేటిఎమ్, మొబిక్విక్ (సెమీ క్లోజ్డ్ సిస్టమ్ పిపిఐలు), గిఫ్ట్ కార్డ్ (క్లోజ్డ్ సిస్టమ్ పిపిఐలు), ట్రావెల్ / డెబిట్ / క్రెడిట్ కార్డులు (ఓపెన్ సిస్టమ్ పిపిఐలు)ఉన్నాయి.
కొన్ని నెలల క్రితం ఆగస్టు 2019 లో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పిపిఐ) కోసం కనీస కెవైసి వివరాలను పూర్తి కెవైసి కంప్లైంట్ పిపిఐలకు మార్చడానికి కాలపరిమితి పొడిగింపును 18 నెలల నుండి 24 నెలలకు ఆర్బిఐ పొడిగించబడింది.
1. పిపిఐ హోల్డర్ కనీస వివరాలను పొందిన తరువాత రూ .10,000 వరకు సెమీ క్లోజ్డ్ పిపిఐలను జారీ చేయడానికి బ్యాంక్, నాన్-బ్యాంకుల అనుమతి ఇస్తుంది.
2. వన్ టైమ్ పిన్ (OTP) తో వెరిఫైడ్ మొబైల్ నంబర్, పిఎంఎల్ రూల్స్ 2005 రూల్ 2 (డి) కింద నిర్వచించిన 'అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రం' ఏదైనా పేరు లేదా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉండాలి.
3. ఏ నెలలోనైనా పిపిఐలలో లోడ్ చేయడానికి మొత్తం రూ .10వేళ మించకూడదు. అలాగే ఆర్థిక సంవత్సరంలో లోడ్ చేసిన మొత్తం రూ .1,00,000 మించకూడదు
also read జియో పోటీతో అతలాకుతలమైన టెలికాం నెట్వర్క్ లు
4. అటువంటి పిపిఐలలో ఏ సమయంలోనైనా బకాయి ఉన్న మొత్తం రూ .10,000 మించకూడదు
5. ఏ నెలలోనైనా పిపిఐల నుండి డెబిట్ చేసిన మొత్తం రూ .10,000 మించకూడదు
6. పిపిఐలను పిపిఐ జారీ చేసిన తేదీ నుండి 24 నెలల వ్యవధిలో కెవైసి కంప్లైంట్ సెమీ క్లోజ్డ్ పిపిఐలుగా మార్చాలి. లేదంటే పిపిఐలలో తదుపరి క్రెడిట్ అనుమతించదు. అయినప్పటికీ పిపిఐ హోల్డర్ ఉన్న బ్యాలెన్స్ను ఉపయోగించడానికి వీలుంటుంది.
7. పిపిఐ జారీ చేసేవారు పిపిఐని ఎప్పుడైనా మూసివేయడానికి ఒక ఎంపికను ఇవ్వాలి. మూసివేసే సమయంలో, బకాయిలు, హోల్డర్ అభ్యర్థన మేరకు 'పిపిఐ హోల్డర్ సొంత బ్యాంక్ ఖాతాకు' బదిలీ చేయబడతాయి.
8. అటువంటి పిపిఐల లక్షణాలు పిపిఐ హోల్డర్కు ఎస్ఎంఎస్ / ఇ-మెయిల్ / పోస్ట్ ద్వారా స్పష్టంగా తెలియజేయబడతాయి.