ఇండియాలో మొబైల్‌ డాటా అత్యంత చౌకగా... జియో స్పెషల్

By Sandra Ashok Kumar  |  First Published Feb 14, 2020, 9:59 AM IST

ఆసియా ఖండంలోని కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ టెలికం రంగంలోకి ప్రవేశించిన నాటి నుంచి భారత్‌లో మొబైల్‌ డాటా అత్యంత చౌకకే లభిస్తున్నది. ప్రపంచ దేశాల్లో జీబీ డాటా ధర సరాసరిగా డాలర్‌ స్థాయిలో ఉండగా..అదే దేశీయంగా రూ.18.5గా ఉన్నది. డాటా చార్జీల్లో భారత్‌ తొలిస్థానాన్ని అక్రమించుకున్నది.


న్యూఢిల్లీ: దేశీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ టెలికం రంగంలోకి ప్రవేశించిన నాటి నుంచి భారత్‌లో మొబైల్‌ డాటా అత్యంత చౌకకే లభిస్తున్నది. ప్రపంచ దేశాల్లో జీబీ డాటా ధర సరాసరిగా డాలర్‌ స్థాయిలో ఉంది. దేశీయంగా ఒక జీబీ డేటా ధర రూ.18.5గా ఉన్నది. డాటా చార్జీల్లో భారత్‌ తొలిస్థానాన్ని అక్రమించుకున్నది. దేశీయంగా సరాసరిగా జీబీ డాటాకు అయ్యే ఖర్చు రూ.18.5 లేదా 0.26 డాలర్లుగా ఉన్నదని కేబుల్‌.కో.యూకే విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 

ఆ మూడు దేశాల్లో డేటా చార్జీలు ఇలా
పొరుగు దేశాలైన శ్రీలంకలో 0.78 డాలర్లు, మంగోలియాలో 0.82 డాలర్లు, మయన్మార్‌లో 0.87 డాలర్లుగా ఉన్నది. ఈ మూడు దేశాలు టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. బ్రాడ్‌బ్యాండ్‌, టీవీ, ఫోన్‌ డీల్‌, టెలికం సేవలు అందిస్తున్న సంస్థల చార్జీలపై ఒక నివేదికను రూపొందించింది. 

Latest Videos

also read వాలంటైన్స్‌ డే ఆఫర్... అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు, టీవీలు....

జింబాబ్వేలో ఒక జీబీ డేటాకు 75.20 డాలర్లు
దీంట్లో జింబాబ్వేలో ఒక్క జీబీ డాటాకు అయ్యే ఖర్చు 75.20 డాలర్లు. భారత్‌లో అవుతున్నదానికంటే జింబాబ్వేలో 289 రెట్లు అధికం. 230 దేశాల్లో ఉన్న 6,313 రకాల డాటా ప్లాన్ల ఆధారంగా సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఒక్కక్క దేశంలో జీబీ డాటాకు అయ్యే ఖర్చులో చాలా తేడాలు ఉన్నాయని తెలిపింది. 

సంపన్న దేశాల్లో డేటా యమ కాస్ట్ లీ
సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్‌లో జీబీ డాటా కావాలంటే భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది. అమెరికాలో ఒక్క జీబీ డాటాకోసం 12.27 డాలర్లు చెల్లించాల్సి ఉండగా, అదే బ్రిటన్‌లో 6.66 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది. కేబుల్‌.కో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికాకు 182 స్థానం లభించగా, అదే బ్రిటన్‌ 136 స్థానంలో నిలిచింది. 

కిర్గిస్థాన్ కు రెండో స్థానం.. తర్వాత కజకిస్తాన్
కిర్గిస్థాన్‌కు 0.27 డాలర్లతో రెండో స్థానం దక్కగా, ఆ తర్వాతి స్థానాల్లో కజకిస్తాన్‌(0.49 డాలర్లు), ఉక్రెయిన్‌(0.51 డాలర్లు) నిలిచాయి. 0.91 డాలర్లతో రష్యాకు 12వ స్థానం లభించింది. పలు దేశాలు ఎక్సలెంట్‌ మొబైల్‌, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మౌలిక సదుపాయాలు, టెలికం సంస్థలు డాటాకు భారీగా రాయితీలు ఇస్తుండటంతో చౌకకే లభిస్తున్నాయని కేబుల్‌.కో.యూకే విశ్లేషకులు డాన్‌ హౌడ్లా తెలిపారు.

జియోకు 36.9 కోట్ల కస్టమర్లు
మూడేళ్లలోనే భారత్‌లో అతిపెద్ద టెలికం సంస్థగా జియో అవతరించడానికి ప్రధాన కారణం కూడా ఇదే కావడం విశేషం. ట్రాయ్‌ తాజా నివేదిక ప్రకారం జియోకు 36.9 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 

సరాసరి డౌన్ లోడ్స్ లో జియో టాప్
ఇదిలా ఉంటే సరాసరి 4జీ డౌన్‌లోడ్‌లో రిలయన్స్‌ జియో దూసుకుపోతున్నది. సెకన్‌కు 20.9 మెగాబైట్ల డాటా డౌన్‌లోడ్‌తో జియో తన తొలిస్థానాన్ని కొనసాగిస్తున్నదని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది. గత నెలలో 4జీ అప్‌లోడ్‌లో మాత్రం వొడాఫోన్‌ ఐడియా తొలిస్థానాన్ని చేజిక్కించుకున్నదని తెలిపింది. 

జియో నుంచి మూడింతలు అధికంగా డౌన్
2019 నవంబర్‌ నెలలో 27.2 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌తో రికార్డును సృష్టించిన జియో ఆ తర్వాతి నెలల్లో క్రమంగా తగ్గుతూ వచ్చింది. భారతీ ఎయిర్‌టెల్‌ డౌన్‌లోడ్‌తో పోలిస్తే జియో మూడింతలు అధికంగా డౌన్‌లోడ్‌ అవుతున్నది. ఎయిర్‌టెల్‌ సరాసరి వేగం 7.9 ఎంబీపీఎస్‌ మాత్రమే ఉండగా, వొడాఫోన్‌ 7.6 ఎంబీపీఎస్‌, ఐడియా 6.5 ఎంబీపీఎస్‌గా ఉన్నది. 

అప్ లోడ్ లో వొడాఫోన్ ఫస్ట్
అప్‌లోడ్‌లో మాత్రం 6 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌ తొలిస్థానంలో నిలిచింది. ఐడియా 5.6 ఎంబీపీఎస్‌తో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. రిలయన్స్‌ జియో 4.6 ఎంబీపీఎస్‌తో, ఎయిర్‌టెల్‌ 3.8 ఎంబీపీఎస్‌గా ఉన్నది. 

ప్రపంచ మొబైల్‌ కాంగ్రెస్ రద్దు
మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2020 రైద్దెంది. ఈ మేరకు ప్రపంచ టెలికం పరిశ్రమ సంఘం జీఎస్‌ఎం అసోసియేషన్‌ గురువారం ప్రకటించింది. కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నేపథ్యంలో ఈ ప్రపంచ మొబైల్‌ టెక్నాలజీ షోకు ప్రముఖ సంస్థలన్నీ ఒక్కొక్కటిగా దూరం కావడంతో చివరకు ఈవెంటే నిలిచిపోయింది. 

also read షియోమీ కొత్త ఎంఐ10 స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర ఎంతో తెలుసా ?

2006 నుంచి బార్సిలోనాలో ఏటా మొబైల్ కాంగ్రెస్
2006 నుంచి స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఏటా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ జరుగుతున్నది. ఇందులో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, విధానకర్తలు, టెలికం సంస్థల అధిపతులు, మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థల యాజమాన్యాలు పెద్ద ఎత్తున పాల్గొంటాయి. 

ఈ ఏడాది కరోనా ప్రభావంతో బ్రేకులు
కానీ ఈ ఏడాది ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా బ్రేకులు పడ్డాయి. చైనాలో పుట్టిన ఈ అంటువ్యాధి.. ఒక దేశం నుంచి మరో దేశానికి విస్తరించే ప్రమాదం ఉండటంతో మొబైల్‌ షో శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమైయ్యాయి. 

హాజరు కాబోమని ప్రకటించిన ప్రముఖ టెక్ దిగ్గజాలు
ఈ క్రమంలోనే వొడాఫోన్‌, సిస్కో, ఎల్‌జీ, వివో, ఎన్‌టీటీ డొకొమో, సోనీ, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మీడియాటెక్‌, ఇంటెల్‌, ఎన్విడియా తదితర సంస్థలన్నీ షోకు హాజరుకాలేమని స్పష్టం చేశాయి. ఈ నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజులపాటు ఈ టెక్నాలజీ సంబురం జరుగాల్సి ఉన్నది.
 

click me!