స్మార్ట్ ఫోన్స్ పై సెలెక్ట్ స్టోర్స్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును ప్రత్యేకమైన ఆఫర్ల కింద అందిస్తుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో స్మార్ట్ ఫోన్స్ పై సెలెక్ట్ స్టోర్స్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును ప్రత్యేకమైన ఆఫర్ల కింద అందిస్తుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.
also read షియోమీ కొత్త ఎంఐ10 స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర ఎంతో తెలుసా ?
‘ది గ్రాండ్ వాలంటైన్స్ డే’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 13 నుంచి 14 వరకు రెండు రోజుల పాటు అమలులో ఉంటుందని కంపెనీ ఫౌండర్, చైర్మన్ వై గురు అన్నారు. కంపెనీ వృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమైనదని, వీరికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
సెలెక్ట్ చేసిన కొన్ని మోడళ్ళలో రూ.8,999 విలువైన 3జీబీ+32జీబీ 4జీ మొబైల్‌ను కేవలం రూ.3,999కే అందిస్తున్నరు. అలాగే రూ.6,999 ధర కలిగిన మైజు స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,999కు, రూ.25,500 విలువైన సామ్‌సంగ్ ఏ6ని రూ.8,999కు, రూ.3,999 విలువైన బ్లూటూత్ టీడబ్ల్యూస్‌ను రూ.1,499కు, రూ.1,999 ధర కలిగిన బ్లూటూత్ స్పీకర్‌ను రూ.399కు, రూ.3,928 విలువైన 10 వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌ను కేవలం రూ.1,499కే విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు.
also read వాట్సాప్ సరికొత్త రికార్డు: ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు
వీటితోపాటు రూ.12,143కు టీసీఎల్ ఎల్‌ఈడీని కొనుగోలు చేసిన వారికి ఉచితంగా హోమ్ థియేటర్ సిస్టమ్‌ను అందిస్తున్నది సంస్థ అని తెలిపారు. ప్రస్తుతం సంస్థకు తెలుగు రాష్ట్రాల్లో 65 రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయి, వచ్చే ఉగాది రోజు మరో ఐదు షోరూంలను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.