వాట్సాప్ సరికొత్త​ రికార్డు: ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు

By Sandra Ashok Kumar  |  First Published Feb 13, 2020, 11:53 AM IST

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో అత్యధికమంది వాడుతున్న యాప్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య 200 కోట్ల మందికి చేరింది.


న్యూయార్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక మైలురాయిని దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 25 శాతం మంది అంటే 200 కోట్ల మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నారు.

2018 ఫిబ్రవరిలో వాట్సాప్ వాడే నెలవారీ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లు (150 కోట్లు)గా ఉన్నట్లు మాతృ సంస్థ ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జూకర్​బర్గ్​ తెలిపారు. అత్యధికంగా భారత్​లో 40 కోట్ల మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. 

Latest Videos

undefined

also read సామ్‌సంగ్ ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్...అధిక బ్యాటరీ లైఫ్, సౌండ్ క్వాలిటీ...

ఆ తర్వాత రెండేళ్లకే మరో 0.5 బిలియన్ మంది యూజర్లు వాట్సాప్​ వినియోగించే జాబితాలో చేరడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 200 కోట్లు దాటినట్లు తెలిపింది. 

వాట్సాప్ ఎంత భద్రంగా ఉందో ఈ సంఖ్య చెప్పకనే చెబుతుందని ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జూకర్​బర్గ్​ ​వెల్లడించారు. తాము ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ నుంచి వైదొలిగే ప్రణాళికేమీ లేదని వాట్సాప్ తెలిపింది. 

also read గుడ్ న్యూస్ ఐటీ రంగంలో ఈ ఏడాది రెండు లక్షల కొత్త ఉద్యోగాలు

2016 ఫిబ్రవరి నాటికి వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకున్నది. ఫేస్ బుక్ ఖాతాదారులు 250 కోట్ల మంది ఉన్నారు. దీంతో వాట్సాప్ మెసేజింగ్ యాప్ రెండోస్థానం. ఇక మరో యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

ఎండ్ టు ఎండ్ ఎన్ స్క్రిప్షన్ తమ సంస్థకు ఒక మైలురాయి అని వాట్సాప్ సీఈఓ విల్ కాథ్ కార్ట్ తెలిపారు. అయితే, మెసేజింగ్ యాప్ వల్ల ఇబ్బందికరంగా మారిందన్న పేరుతో ప్రభుత్వాలు వాట్సాప్ మేసేజింగ్ యాప్ పై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. ఉగ్రవాదం, బాలల దోపిడీ, ఇతర నేరాల మెసేజ్‌లను చూడనివ్వొద్దని వివిధ దేశాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. 

click me!