చైనా టీవీల దిగుమతిపై ఆంక్షలు...ఆర్థికశాఖ కీలక నిర్ణయం..

By Sandra Ashok Kumar  |  First Published Feb 14, 2020, 1:50 PM IST

డ్రాగన్ లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నది. చైనా నుంచి టీవీల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోనున్నది. అవసరం లేని వస్తువుల దిగుమతి తగ్గింపుతో కరంట్ ఖాతా లోటు తగ్గించుకోవాలన్నది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహం.


న్యూఢిల్లీ: ఒకవైపు ఆదాయం పెంపు మార్గం.. మరోవైపు వాణిజ్య లోటు తగ్గింపు కోసం కేంద్ర ఆర్థిక శాఖ బాగానే కసరత్తు చేస్తోంది. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోదీ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం ‘మేకిన్ ఇండియా’ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా విదేశీ దిగుమతులను తగ్గించుకోవడం కోసం అవసరం లేని వస్తువుల జాబితాలో ఉన్న టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 

also read ఎయిర్‌టెల్ డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో 4 కొత్త రీఛార్జ్ ప్లాన్లు

Latest Videos

విదేశీ టీవీల దిగుమతిపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్య మంత్రిత్వశాఖలు చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. దిగుమతులపై ఆంక్షలు విధిస్తే.. సదరు దిగుమతి దారు విదేశీ టీవీని దిగుమతి చేసుకోవాలంటే వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 100 కోట్ల డాలర్ల విలువైన టీవీలు భారతదేశంలోకి దిగుమతి అయ్యాయి. భారతదేశానికి టీవీలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తొలి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో వియత్నాం, మలేషియా, హాంకాంగ్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, థాయిలాండ్, జర్మనీ దేశాలు కొనసాగుతున్నాయి. 

also read  మళ్ళీ అదేసీన్ రిపీట్ చేసిన వొడాఫోన్‌ ఐడియా... నష్టాలు రూ.6,439 కోట్లకు పెరిగాయి.

2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి టీవీల దిగుమతుల విలువ 100 కోట్ల డాలర్లు ఉంటాయి. ఇందులో చైనా దిగుమతులు 535 మిలియన్ల డాలర్లుగా ఉన్నాయి. ఇక తర్వాతీ స్థానంలో వియత్నాం 327 మిలియన్ల డాలర్లు, మలేషియా 109 మిలియన్ డాలర్లు, హాంకాంగ్ 10.52 మిలియన్ల డాలర్ల విలువ గల టీవీలను భారతదేశానికి ఎగుమతి చేస్తున్నారు. 

మేడిన్ ఇండియాను ప్రోత్సహించేందుకు ఫర్నీచర్ దిగుమతులపైనా ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిఫైన్డ్ ఫామాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిఫైన్డ్ పామాయిల్ సహా వివిధ దిగుమతుల విలువ 500 బిలియన్ల డాలర్లు. 
 

click me!