ఎయిర్‌టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా కెనడా, చైనా, థాయిలాండ్, యుఎస్ వంటి దేశాలను కవర్ చేస్తాయి.
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్త అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) రీఛార్జ్ ప్లాన్‌ల పోర్ట్‌ఫోలియోను నాలుగు కొత్త ప్లాన్‌లను రూ. 648, రూ. 755, రూ. 799, రూ. 1,199 ప్రవేశపెడుతుంది.
ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో జాబితా చేసిన కొత్త అంతర్జాతీయ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్లు అనేక దేశాలను కవర్ చేస్తాయి. హై-స్పీడ్ డేటా, ఎస్‌ఎంఎస్ లు వంటి ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.
also read మళ్ళీ అదేసీన్ రిపీట్ చేసిన వొడాఫోన్ ఐడియా... నష్టాలు రూ.6,439 కోట్లకు పెరిగాయి.
ఎయిర్‌టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌ల జాబితాలో రూ. 648 రీఛార్జ్ ప్లాన్ 500MB డేటా, 100 నిమిషాల ఇన్కమింగ్ కాల్స్ , 100 నిమిషాల వాయిస్ కాల్స్ ఇండియా, లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్ అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్ ఇస్తుంది.
ఈ ప్లాన్ బ్రెజిల్, ఇరాన్, ఇరాక్, జపాన్, జోర్డాన్, నేపాల్, పాలస్తీనా, ఖతార్, రష్యా, సౌదీ అరేబియాలో కవర్ చేస్తుంది.
అల్బేనియా, బెల్జియం, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఇండోనేషియా, నార్వే, స్పెయిన్, యుకె, యుఎస్ వంటి దేశాలకు ఎయిర్‌టెల్ రూ. 649 రీఛార్జ్ ప్లాన్.
అదనంగా రూ. 648 / రూ. 649 ప్లాన్ తో పాటు ఎయిర్‌టెల్‌లో రూ. 755 అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ తిసుకొచ్చింది ఇది ఐదు రోజుల పాటు 1GB డేటా ప్రయోజనాలతో అందిస్తుంది.
ఈ ప్లాన్లో అల్బేనియా, బహామాస్, భూటాన్, కెనడా, హాంకాంగ్, ఇరాన్, ఇటలీ, కొరియా, మెక్సికో, నేపాల్, న్యూజిలాండ్, శ్రీలంక, థాయిలాండ్, యుకె, యుఎస్ వంటి దేశాలను కవర్ చేస్తుంది.
also read ఇండియాలో మొబైల్ డాటా అత్యంత చౌకగా... జియో స్పెషల్
ఎయిర్‌టెల్ కూడా రూ. 799 అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ ద్వారా 100 నిమిషాల లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్‌తో పాటు ఇన్‌కమింగ్ కాల్స్ అలాగే 30 రోజుల పాటు ఇండియాకి కాల్స్ చేసుకోవచ్చు.
అల్బేనియా, అర్మేనియా, ఆస్ట్రేలియా, బహామాస్, బంగ్లాదేశ్, కెనడా, చైనా, హాంకాంగ్, ఇరాన్, ఇరాక్, జపాన్, న్యూజిలాండ్ మరియు యుఎస్ వంటి దేశాలలో ప్రయోజనాలను పొందవచ్చు.
కొత్త ప్లాన్లలో 1 జిబి డేటా, 100 నిమిషాల లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ తో పాటు 30 రోజుల పాటు వర్తిస్తుంది.