ఇకపై ఎయిర్‌ ఇండియా ఫ్లైట్స్‌లో వైఫై సేవలు.. ఇంతకీ విమానంలో వైఫై ఎలా పనిచేస్తుందో తెలుసా.?

By Narender Vaitla  |  First Published Jan 4, 2025, 8:25 PM IST

విమానాల్లో ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండదనే విషయం తెలిసిందే. భూమికి వందల అడుగుల ఎత్తులో ప్రయణించే విమానంలో ఇంటర్నెట్‌ లభించదు. అయితే కొన్ని విమానాల్లో మాత్రం ఆయా విమానాయ సంస్థలు వైఫై సేవలను అందిస్తాయి. ఇంతకీ వానాల్లో వైఫై ఎలా పని చేస్తుంది.? ఇందుకోసం ఏ టెక్నాలజీని ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


విమానాల్లో ఇంటర్నెట్ సేవలు చాలా పరిమితిలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు చెందిన ఎయిర్‌ లైన్స్‌లోనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే తాజాగా దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా వైఫై ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఎయిర్‌బస్‌ ఏ350, బోయింగ్‌ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్‌ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఇటీవల ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది. 

తొలి విమానయాన సంస్థ ఇదే.. 

Latest Videos

విమానాల్లో వైఫై సేవలను అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. ప్రస్తుతం దేశంలో పలు రూట్లలో ఈ సేవలను కాంప్లిమెంటరీగా అందిస్తున్నార. క్రమంగా ఈ సేవలను అన్ని విమానాల్లోనూ ప్రవేశపెట్టేందుకు ఎయిరిండియా సన్నాహాలు చేస్తోంది. 

ఎయిరిండియా తీసుకొచ్చిన ఈ సేవలపై ప్రయాణికులు భూమి నుంచి 10,000 అడుగుల ఎత్తులో కూడా ఎంచక్కా తమ స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌లో ఇంటర్నెట్ సేవలను పొందొచ్చు. ప్రస్తుతం ఈ సేవలను ఎయిరిండియా ఉచితంగా అందిస్తోంది. ఇదిలా ఉంటే ఎయిరిండియా ఈ సేవలను ఇప్పటికే న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ రూట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఎలా పని చేస్తుంది.? 

విమానయాన సంస్థలు ఎయిర్‌ టు గ్రౌండ్‌ సిస్టమ్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా విమానంలో యాంటినాను అమరుస్తారు. భూమిపై ఉన్న సమీప టవర్‌ నుంచి సిగ్నల్‌ను స్వీకరిస్తుంది. ఇదే సిగ్నల్‌ విమానంలో ఉన్న ప్రయాణికులు ఉపయోగిచుకుంటారు. అయితే భూమిపై కాకుండా సముద్రాలు, దట్టమైన అడవుల గుండా వెళ్తున్న సమయంలో మాత్రం ఇంటర్నెట్ లభించదు. 

కొన్ని విమానయాన సంస్థలు శాటిలైట్ ఆధారిత వైఫై సేవలను అందిస్తున్నాయి. ఈ విధానంలో నేరుగా శాటిలైట్‌ నుంచి ఇంటర్నెట్‌ లభిస్తుంది. ఎయిర్-టు-గ్రౌండ్ ఆధారిత నెట్‌వర్క్ ఉపగ్రహాన్ని ఉపయోగించి, సిగ్నల్ మొదట భూమిపై ఉన్న ట్రాన్స్‌మిటర్‌కు సిగ్నల్‌ను పంపిస్తుంది. ఈ సిగ్నల్‌ విమానంలో అమర్చిన యాంటినాకు పంపుతుంది. 

విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్న దేశాల్లో అమెరికాకు ముందు స్థానంలో ఉంది. రెండు ప్రధాన విమానయాన సంస్థలు డెల్టా, యునైటెడ్ ప్రతీ నెలా 1.5 మిలియన్లకు పైగా ప్రయాణీకులకు ఇన్‌ఫ్లైట్ వైఫై సేవలను అదిస్తోంది. జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది వినియోగదారులకు తమ సేవలను అందిస్తోంది. 
 

click me!