తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: శశికళకు షాక్, ఓటు గల్లంతు

Published : Apr 06, 2021, 09:01 AM IST
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: శశికళకు షాక్, ఓటు గల్లంతు

సారాంశం

జయలలిత సన్నిహితురాలు శశికళకు తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ లో షాక్ తగిలింది. ఓటర్ల జాబితా నుంచి శశికళ పేరు గల్లంతైంది. ఆమెతో పాటు వేద నిలయంలో ఉంటూ వచ్చిన మరో 18 ఓట్లను కూడా తొలగించారు.

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడియంకె మాజీ ప్రధాన కార్యదర్శి వీకె శశికళకు తమిళనాడు శానససభ ఎన్నికల్లో షాక్ తగిలింది. ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమెకు ఓటు వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మంగళవారంనాడు జరుగుతున్న పోలింగ్ లో ఆమె ఓటు వేయలేకపోయారు. ఓటర్ల జాబితాలో ఆమె పేరు గల్లంతైంది. 

అంతేకాకుండా జయలలిత అధికారిక నివాసం వేద నిలయంలో ఉంటున్న మరో 18 మంది పేర్లను కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. తమ చర్యను అధికారులు సమర్థించుకుంటున్నారు వేద నిలయం ఏ మాత్రం ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి కాదని, ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుందని, ప్రస్తుతం అందులో ఎవరూ నివసించడం లేదని అధికారులు అంటున్నారు 

శశికళ బంధువు ఇళవరసి, జయలలిత వంట మనిషి పేర్లనే కాకుండా ఇతరుల పేర్లను కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు 2017లో జైలుకు వెళ్లేంత వరకు శశికళ పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలోనే ఉంటూ వచ్చారు. జయలలితతో పాటు ఆమె స్టెల్లా మేరీస్ కాలేజీలో శశికళ ఓటు వేసేవారు. 

బెంగళూరులోని జైలు నుంచి జనవరిలో విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో శశికళ చైన్నైకి వచ్చి  టీనగర్ లోని తన బంధువు ఇంట్లో ఉంటున్నారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు సీఎంగా స్టాలిన్: ఈ నెల 7న ప్రమాణం
వారసత్వం: జయలలిత కంచుకోటలో విజయం ఆయనదే..