జయ మరణంపై విచారణ, అన్నాడీఎంకే అవినీతిపై ప్రత్యేక కోర్టు: డీఎంకే మేనిఫెస్టో ఇదే..!!

By Siva KodatiFirst Published Mar 13, 2021, 2:17 PM IST
Highlights

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 173 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. 

మేనిఫెస్టోలోని అంశాలు:

  • విద్య, ఉపాధి, ఆర్ధికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత
  • అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టులు
  • పెంచిన ఆస్తి పన్ను రద్దు
  • హిందూ ఆలయాల పునరుద్దరణకు వెయ్యి కోట్లు
  • అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
  • వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 సబ్సిడీ
  • మసీదు, చర్చిల పునరుద్దరణకు రూ.200 కోట్లు
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు అవకాశం
  • జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమీషన్
  • ఆవిన్  పాల ధర లీటర్‌పై రూ.3 తగ్గింపు
  • మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
  • నీట్ పరీక్ష రద్దుకు శాసనసభ తొలి సమావేశంలో ఆర్డినెన్స్
  • కార్మికులకు పాత పింఛన్ పథకం అమలు
  • జయలలిత మరణంపై విచారణ వేగవంతం
  • కరుణానిధి పేరుతో కలైంజర్ క్యాంటీన్ల ఏర్పాటు
click me!