తమిళనాడు సీఎంగా స్టాలిన్: ఈ నెల 7న ప్రమాణం

By narsimha lodeFirst Published May 3, 2021, 4:16 PM IST
Highlights

తమిళనాడు సీఎంగా స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓటమిపాలు కావడంతో సీఎం పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ కు పంపారు.
 

చెన్నై: తమిళనాడు సీఎంగా స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓటమిపాలు కావడంతో సీఎం పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ కు పంపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె విజయం సాధించిన తర్వాత మెరీనా బీచ్ లోని తన తండ్రి సమాధి వద్ద స్టాలిన్ నివాళులర్పించారు. కోవిడ్ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా స్టాలిన్ తెలిపారు.234 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో డిఎంకె కూటమి 152 స్థానాల్లో విజయం సాధించింది.  తమిళనాడులో  డిఎంకె విజయంలో స్టాలిన్ కీలకపాత్ర పోషించారు. 

తమిళనాడు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించిన అన్నాడిఎంకె ఆశలపై డిఎంకె చెక్ పెట్టింది. 10 ఏళ్ల తర్వాత తమిళనాడులో డిఎంకె అధికారంలోకి వచ్చింది. కరుణానిధి, జయలలితలు మరణించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో డిఎంకె అధికారంలోకి వచ్చింది. 


 

click me!