తమిళనాడు: పదేళ్ల తర్వాత అధికారంలోకి డిఎంకె

By narsimha lodeFirst Published May 2, 2021, 12:08 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత డిఎంకె అధికారంలోకి రానుంది. కరుణానిధి లేకున్నా కూడ పార్టీని  స్టాలిన్ విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత డిఎంకె అధికారంలోకి రానుంది. కరుణానిధి లేకున్నా కూడ పార్టీని  స్టాలిన్ విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుండేది కానీ ఆ తర్వాత ద్రవిడ పార్టీల ఆధిపత్యంలోకి ఈ రాష్ట్రం వెళ్లింది.డిఎంకె లేదా అన్నాడిఎంకె పార్టీలతోనే జాతీయ పార్టీలు కూడ పొత్తులు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

1952 నుండి 1962 వరకు తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1967లో తొలిసారిగా డిఎంకె అధికారాన్ని చేపట్టింది.  ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో కూడ అదే పార్టీ విజయం సాధించింది. డిఎంకె నుండి చీలిపోయి అన్నాడిఎంకెను  ఎంజీ రామచంద్రన్ ఏర్పాటు చేశారు. 1977లో అన్నాడిఎంకె తొలిసారిగా అధికారాన్ని చేపట్టింది. 1980లో కూడ ఆ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకొంది. 

1984లో కూడ అదే పార్టీ విజయం సాధించింది. 1989లో డిఎంకె అధికారాన్ని చేపట్టింది. 1991 ఎన్నికల్లో అన్నాడిఎంకె గెలుపొందింది. 1996 ఎన్నికల్లో డిఎంకె గెలిచింది. 2001లో అన్నాడిఎంకె విజయం సాధించింది. 2006లో డిఎంకె గెలిచింది. 
2011,2016 ఎన్నికల్లో అన్నాడిఎంకె గెలుపొందింది.2021 ఎన్నికల్లో డిఎంకె విజయం సాధించింది. పదేళ్ల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె విజయం సాధించింది. 


 

click me!