పెళ్లైన స్టార్ హీరోతో నయనతార సహజీవనం.. రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలు.. !

By AN TeluguFirst Published Apr 1, 2021, 1:39 PM IST
Highlights

తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నాయి. అభ్యర్థులంతా ఎండలో తిరుగుతూ జనాల ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. 

తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నాయి. అభ్యర్థులంతా ఎండలో తిరుగుతూ జనాల ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. 

అయితే ప్రచారంలో సినీ తారలు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కమల్ హాసన్ కు మద్దతుగా సుహాసిని ప్రచారం చేస్తుండగా, బిజెపికి మద్దతుగా ఖుష్బూ, నమిత సహా పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇక డీఎంకేలో స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలో బిజెపి నేత సినీనటుడు రాధా రవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన తన ప్రసంగంలోకి హీరోయిన్ నయనతారను లాక్కొచ్చారు.

ఉదయనిధి స్టాలిన్ తో నయన్ సహజీవనం చేస్తోందని వివాదాస్పద ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రస్తుతం తమిళనాడులో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బిజెపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాధా రవి ‘నేను నయనతార గురించి చెడుగా మాట్లాడానని, మహిళల గురించి చెడుగా మాట్లాడానని గతంలో అన్నారు. పార్టలో ఉండే అర్హత లేదని తిట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించడానికి మీరెవరు? నేనే బయటకు వెళ్తున్నా. మీ పార్టీలో నయనతార ఎవరు? ఉదయనిధితో నయనతార సహజీవనం చేస్తోందా? అయినా అవన్నీ నేను పట్టించుకోను.’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.  

అయితే ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. ట్విటర్‌ వేదికగా ‘రాధారవి నోరు జారి చేసిన వ్యాఖ్యలతో అలసిపోయాను. ఇతను బహిరంగంగానే దుర్భాషలాడుతున్నాడు. వేధింపులకు గురి చేస్తున్నాడు. ఒక పార్టీ అతన్ని స్టార్ క్యాంపెయినర్‌గా ఎందుకు తీసుకుంటుంది? ఇంకా రాజా రాధారవి లాంటి వారికే మనం ఓటు వేసి అధికారంలో కూర్చోబెడతాం’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

 2019 లోనూ నయనతారపై రాధారవి అవమానకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై నయన్‌ కూడా స్పందిస్తూ  నీకు జన్మనిచ్చిన తల్లి కూడా మహిళలే అని రాధారవి పై మండిపడ్డారు. అయినప్పటికీ ఆయనలో మాత్రం మార్పు రాకపోగా, తాజాగా మరోసారి అదే తరహాలో దిగజారుడు వ్యాఖ్యలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలాఉండగా రాధారవి ఒకప్పుడు డీఎంకే పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అతన్ని తాత్కాలికంగా తొలగించింది. దీంతో డీఎంకే నుంచి బయటకు వచ్చిన రాధారవి అనంతరం బీజేపీలో చేరారు. కాగా తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కరుణానిధి, జయలలిత మరణించిన తరువాత తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం విశేషం.ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల్లో ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయని అంతటా ఆసక్తి నెలకొంది. కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌తో పాటు  తమిళనాడు ఫలితాలను ప్రకటించనున్నారు.

click me!