తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: అన్నాడీఎంకే‌కు షాక్.. కూటమి నుంచి తప్పుకున్న కెప్టెన్

By Siva KodatiFirst Published Mar 9, 2021, 2:22 PM IST
Highlights

తమిళనాడులో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సినీ నటుడు, డీఎండీకే (దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం) అధినేత విజయ్ కాంత్ ఏఐఏడీఎంకే కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు

తమిళనాడులో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సినీ నటుడు, డీఎండీకే (దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం) అధినేత విజయ్ కాంత్ ఏఐఏడీఎంకే కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు.

పార్టీల నేతలతో సమావేశమైన తర్వాత విజయ్‌కాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటుపై జరిపిన చర్చలు విఫలం కావడంతో విజయ్ కాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

23 అసెంబ్లీ, ఒక రాజ్యసభ సీటు కోసం విజయ్ కాంత్ అన్నాడీఎంకేను కోరారు. అయితే కేవలం 13 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తామని అధికార పార్టీ చెప్పడంతో విజయ్‌కాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే డీఎంకే- కాంగ్రెస్ కూటమిలో కానీ, కమల్ హసన్ సారథ్యంలోని తృతీయ కూటమిలో కూడా డీఎండీకే చేరే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విజయ్ కాంత్‌కు బుజ్జగించేందుకు బీజేపీ, అన్నాడీఎంకేలు రాయబారం నడిపే అవకాశం వుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

click me!