అతి చిన్నవయసులోనే జడ్జిగా.. 21ఏళ్ల మయాంక్ రికార్డ్

By telugu team  |  First Published Nov 23, 2019, 6:48 AM IST

ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మయాంక్‌కు ఈ అవకాశం లభించింది. 


ఆ కుర్రాడికి నిండా 21ఏళ్లు లేవు. కానీ అప్పుడే జడ్జి స్థాయికి ఎదిగాడు. మన దేశంలో అతి చిన్న వయసులోనే ఆ రికార్డు సాధించిన ఏకైక కుర్రాడుగా జైపూర్ కి చెందిన మయాంక్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కి చెందిన మయాంక్ ప్రతాప్ సింగ్ సాధించిన అరుదైన ఘనత చూసి అందరూ షాకౌతున్నారు. దేశవ్యాప్తంగా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Latest Videos

undefined

ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మయాంక్‌కు ఈ అవకాశం లభించింది. ఈ క్రమంలో రాజస్తాన్‌ జుడిషియల్‌ సర్వీస్‌-  2018 పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన మయాంక్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు.

“సమాజంలో న్యాయమూర్తుల కోసం కేటాయించిన ప్రాముఖ్యత మరియు గౌరవం ద్వారా నేను ఎప్పుడో న్యాయ సేవల వైపు ఆకర్షితుడయ్యాను. ఈ సంవత్సరం రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు పూర్తిచేశాను అని మయాంక్ తెలిపారు.

ఈ విజయంతో తాను సంతోషంగా ఉన్నానని..తన కుటుంబసభ్యులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే తాను ఈ పరీక్షలో ఉత్తీర్ణుడవడంలో వారి కృషి ఎనలేనిదని మయాంక్ అన్నారు. జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష హాజరు కావడానికి అసలు వయస్సు 23 సంవత్సరాలు, అయితే దీనిని ఈ ఏడాది రాజస్థాన్ హైకోర్టు 21 సంవత్సరాలకు తగ్గించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మయాంక్ వివరించారు.
 

click me!