చదివేది ఏడో తరగతి... చేస్తున్నది ఐటీ ఉద్యోగం

By telugu team  |  First Published Oct 30, 2019, 10:15 AM IST

సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు ఇద్దరూ రోజూ ల్యాప్ టాప్స్ లో పని చేయడాన్ని చిన్నారి గమనిస్తూ ఉండేవాడు. దీంతో.. ఏడేళ్ల వయసులోనే అతడికి కోడింగ్, జావా ఇతర సాఫ్ట్  వేర్ కోర్సులపై ఆసక్తి పెరిగింది. కుమారుడి ఆసక్తిని గమనించిన అతని తల్లిదండ్రులు కూడా బాలుడిని ప్రోత్సహించారు.


ఆ బాలుడు చదివేది ఏడో తరగతి... కానీ అతని మేధోశక్తి మాత్రం అపారం. చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ సాధించిన బాలుడు... ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు కేవలం 12ఏళ్లు కావడం విశేషం.

బాలుడి పూర్తి వివరాల్లోకి వెళితే.... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి. రాజ్ కుమార్, ప్రియ దంపతులు క్యాప్ జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్(12) స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

Latest Videos

undefined

సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు ఇద్దరూ రోజూ ల్యాప్ టాప్స్ లో పని చేయడాన్ని చిన్నారి గమనిస్తూ ఉండేవాడు. దీంతో.. ఏడేళ్ల వయసులోనే అతడికి కోడింగ్, జావా ఇతర సాఫ్ట్  వేర్ కోర్సులపై ఆసక్తి పెరిగింది. కుమారుడి ఆసక్తిని గమనించిన అతని తల్లిదండ్రులు కూడా బాలుడిని ప్రోత్సహించారు.

వారి ప్రోత్సాహంతో పలు సాఫ్ట్ వేర్ కోర్సులను నేర్చుకున్నాడు. తన కొడుకు ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు... పలు కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేశారు. కాగా... ఇటీవల  మోంటైగ్నే సంస్థలో నెలకు రూ.25 వేల గౌరవ వేతనంతో శరత్‌కు డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కింది. దాంతో పాటుగా కొన్ని రోజులు ఉద్యోగం, కొన్ని రోజులు చదువుకునేందుకు అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. మూడు రోజులు పాఠశాలకు... మరో మూడు  రోజులు ఉద్యోగానికి వెళ్తుండటం విశేషం.

AlsoRead ఇన్నోవా కారు యజమానికి ఝలక్.. రూ.76వేలు జరిమానా

12 ఏళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కించుకున్న శరత్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శరత్‌ తల్లిదండ్రులు మంగళవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శరత్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

click me!