రైన సమయంలో టాలెంట్ ఉన్న పిల్లలను గుర్తించి, వాటిని రాటుతేల్చేందుకు పెట్టుబడి పెడితే... ఇలాంటి ఫలితాలు బోలెడు వస్తాయి...
ద్రోణాచార్య అవార్డు గ్రహీత, మాజీ హాకీ కోచ్ హరిందర్ సింగ్ కామెంట్స్...
41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి, సరికొత్త చరిత్ర సృష్టించింది భారత పురుషుల హాకీ జట్టు. సెమీ ఫైనల్స్‌లో ఓడినా, కాంస్య పతక పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. ఆఖరి సెకన్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా, యావత్ భారతావనికి సంబరాలను తీసుకొచ్చింది.
ఈ విజయం తర్వాత ప్రత్యేకంగా ఆసియానెట్‌తో మాట్లాడిన భారత హాకీ మాజీ కోచ్ హరిందర్ సింగ్, యువకుల్లో నిండిన ఆత్మవిశ్వాసం, నమ్మకమే ఈ విజయానికి కారణమని అన్నారు. ‘ఏ ఆటలో విజయాలు దక్కాలంటే, ఆటగాళ్లల్లో చిన్నతనం నుంచి గెలుపు కసిని నింపాయి.
undefined
విజయం కోసం ఆఖరి కోసం పోరాటే తత్వంతో ఏ జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని ఇస్తే... వాళ్లు మ్యాచ్ విన్నర్లుగా మారతారు. జూనియర్ హాకీ వరల్డ్‌కప్ గెలిచిన కుర్రాళ్లు ఎలాంటి మార్పును తీసుకొచ్చారో చూశారుగా...
సరైన సమయంలో టాలెంట్ ఉన్న పిల్లలను గుర్తించి, వాటిని రాటుతేల్చేందుకు పెట్టుబడి పెడితే... ఇలాంటి ఫలితాలు బోలెడు వస్తాయి. ఎలాంటి అడ్డంకులనైనా ఎదిరించగల సత్తా ఉన్న టీమ్ తయారవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు హరిందర్ సింగ్.
ప్రస్తుతం అమెరికా హాకీ జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న హరిందర్ సింగ్, భారత జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. 2000 సమ్మర్ ఒలింపిక్స్, 2005 హాకీ జూనియర్ వరల్డ్‌కప్, 2006 హాకీ వరల్డ్‌కప్, 2006 ఆసియా గేమ్స్, 2009 హాకీ ఆసియా కప్, 2010 హాకీ వరల్డ్‌కప్ టోర్నీలకు కోచ్‌గా ఉన్నాడు.
2012లో ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న హరిందర్ సింగ్ కోచింగ్‌లోనే 2016 హాకీ జూనియర్ వరల్డ్‌కప్ గెలిచింది టీమిండియా. ప్రస్తుత జట్టులో ఉన్న చాలామంది ప్లేయర్లు, ఈ టీమ్‌లో నుంచి వచ్చినవాళ్లే.