చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

Siva Kodati |  
Published : May 19, 2022, 09:24 PM ISTUpdated : May 19, 2022, 09:45 PM IST
చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

సారాంశం

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్ నిలిచింది. 52 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (world boxing championship) విజేతగా భారత్ నిలిచింది. 52 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ (nikhat zareen) స్వర్ణ పతకం (gold medal) గెలిచింది. ఫైనల్‌లో థాయిలాండ్ బాక్సర్‌పై నిఖత్ జరీన్ గెలిచారు. ఈ విజయం ద్వారా మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ సరసన నిఖత్ జరీన్ నిలిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ బాక్సర్  నిఖత్ జరీనా సెమీస్ లో నిఖత్.. బ్రెజిల్ కు చెందిన డి అల్మీద కరోలిన్ ను 5-0  తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ ఈవెంట్ లో  ఆది నుంచి రాణిస్తున్న  జరీన్.. ప్రీమంగోలియా కు చెందిన అల్తాంట్సెట్సెగ్ ను చిత్తు చేసింది. ఇక గత సోమవారం జరిగిన క్వార్టర్స్ లో ఇంగ్లాండ్ అమ్మాయి చార్లీ సియాన్ డేవిసన్ ను 5-0తో మట్టికరిపించి సెమీస్ కు చేరింది. 

PREV
click me!

Recommended Stories

India vs England : మిస్టరీ స్పిన్నర్‌ ఔట్.. సీనియర్ రీఎంట్రీ : సెమీస్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే