రికార్డ్.. 25బంతుల్లో సెంచరీ..!

Published : Mar 22, 2019, 02:06 PM IST
రికార్డ్.. 25బంతుల్లో సెంచరీ..!

సారాంశం

ఇంగ్లండ్  యువ క్రికెటర్ విల్ జాక్స్.. రికార్డ్ సృష్టించాడు. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. 

ఇంగ్లండ్  యువ క్రికెటర్ విల్ జాక్స్.. రికార్డ్ సృష్టించాడు. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. కేవలం 25 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. దుబాయి వేదికగా జరిగిన టీ 10 మ్యాచ్ లో ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు.  ఈ క్రమంలోనే ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. టీ10 మ్యాచ్‌లో భాగంగా సర్రే జట్టుకు ఆడుతున్న జాక్స్.. లాంక్‌షైర్‌ జట్టు బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు.

ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన జాక్స్‌ పరుగుల వరద పారించాడు.  ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్‌ ఆరంభానికి ముందు వ్యక్తిగత స్కోరు 62 వద్ద ఉన్న ఈ హిట్టర్..  ఆ ఓవర్ ముగిసే సమయానికి 98 పరుగులతో నిలిచాడు.కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం మైలురాయిని అందుకున్న జాక్స్.. ఆ తర్వాత 25 బంతుల్లో శతకం మార్క్‌ని చేరుకోవడం విశేషం.

 30 బంతుల్లో 105 పరుగులు చేసిన అనంతరం జాక్స్‌ ఔటయ్యాడు. జాన్స్‌ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నస్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో తడబడిన లాన్‌షైర్ 9.3 ఓవర్లలోనే 81 పరుగులకి ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: సంజూ, అభిషేక్‌లలో ఒకరికి షాక్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లోకి వైభవ్ సూర్యవంశీ