
లండన్: రెండో టెస్టు మ్యాచులోనూ తమ ఓటమిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండు ఆటగాళ్లు విజయానికి అర్హులమని, తాము ఓటమికి అర్హులమని ఆయన చెప్పాడు. తామెంత గర్వపడే విధంగా ఆడలేదని ఆయన అన్నాడు.
వర్షం గురించి ప్రస్తావించగా మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాతావరణ పరిస్థితుల గురించి ఆలోచించకూడదని అన్నారు. మైదానంలోకి దిగినప్పుడు వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నాడు.
కొన్నిసార్లు పచ్చదనం కూడా అడ్డంగా వస్తుందని, వాతావరణ పరిస్థితులు బాగాలేవని చేతులు ముడుచుకు కూర్చోలేమని అన్నాడు. ఇంగ్లాండు బౌలర్లు అవిశ్రాంతంగా తమపై దాడికి దిగారని చెప్పాడు. ఇక్కడి వాతావరణం అంచనాలకు అందదని, దానివల్లనే తమ తుది కూర్పులో లోపం జరిగిందని అన్నాడు.
మరో సీమర్ లేకపోవడం దెబ్బ తీసిందని, ఇద్దరు స్పిన్నర్లలతో మైదానంలోకి దిగడం తప్పిదమేనని అన్ాడు. తన వెన్నునొప్పి పదే పదే వేధిస్తోందని, పని ఒత్తిడి దీనికి కారణమని, మరో ఐదు రోజుల్లో అంతా కుదురుకుంటుందని తాను భావించానని అన్నాడు.