సారీ.. నన్ను బ్యాన్ చేయకండి.. విరాట్ కోహ్లీ

By ramya neerukondaFirst Published Sep 5, 2018, 4:24 PM IST
Highlights

వెంటనే నన్ను క్షమించండి.. నాపై నిషేధం విధించకండి అంటూ వేడుకున్నా. అతను మంచి వ్యక్తి. యుక్త వయస్సులో ఇవన్నీ సహజం అనుకొని నన్ను అర్థం చేసుకున్నాడు’ అని కోహ్లీ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 

సారీ.. నన్ను బ్యాన్ చేయకండి అని టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ వేడుకున్నారు. అదేంటి.. కోహ్లీ అలా రిక్వెస్ట్ చేయడం ఏంటి..? అంత పెద్ద తప్పు ఏం చేశాడు..? అని అనుకుంటున్నారా.. ఇది ఇప్పటి సంగతి కాదులేండి. 2012 సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో జరిగిన ఓ సందర్భాన్ని కోహ్లీ తాజాగా గుర్తుచేసుకున్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చర్చించారు.

కోహ్లీ తెలిపిన వివరాల ప్రకారం.. టీమిండియా 2012లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. రెండో టెస్టు సిడ్నీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టేడియంలో స్థానిక ప్రేక్షకుల ప్రవర్తనతో చిరాకుపడ్డ కోహ్లీ ఓ దశలో వారివైపు మధ్య వేలిని చూపించి తన కోపాన్ని ప్రదర్శించాడు. విరాట్‌ ప్రవర్తను గమనించిన మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ అతన్ని తర్వాతి రోజు తన రూమ్‌కి రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో కోహ్లీ అక్కడికి వెళ్లాడు.

 ‘నిన్న బౌండరీ లైన్‌ వద్ద ఏం జరిగింది? అని ప్రశ్నించాడు. దీనికి నేను ఏం జరగలేదు అని చెప్పేసరికి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌ను నా ముందుకు విసిరేశాడు. అందులో నేను మధ్య వేలిని చూపిస్తున్న ఫొటో ఉంది. వెంటనే నన్ను క్షమించండి.. నాపై నిషేధం విధించకండి అంటూ వేడుకున్నా. అతను మంచి వ్యక్తి. యుక్త వయస్సులో ఇవన్నీ సహజం అనుకొని నన్ను అర్థం చేసుకున్నాడు’ అని కోహ్లీ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ ఈ ఘటనకు సంబంధించి ఓ ట్వీట్‌ కూడా చేశాడు. ‘క్రికెటర్లు అలా ప్రవర్తించొద్దన్న నియమాన్ని అంగీకరిస్తాను. అయితే ఆ గుంపులోంచి మన అమ్మ, సోదరి గురించి చెడుగా మాట్లాడితే ఏం చేయాలి? చాలా ఘోరమైన మాటలు విన్నా’ అంటూ ట్వీట్‌ పెట్టాడు

click me!