టెస్ట్ సిరీస్‌లో టీంఇండియా ఓటమికి బాధ్యత క్రికెటర్లది కాదు...ఆ ఇద్దరిదే : సౌరవ్ గంగూలి

By Arun Kumar PFirst Published Sep 4, 2018, 6:42 PM IST
Highlights

ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ ను టీంఇండియా మరో టెస్ట్ మిగిలుండగానే కోల్పోయిన విషయం తెలిసిందే. నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత జట్టు ఓటమిపాలవడంతో టెస్ట్ సీరీస్ ను 3-1 తేడాతో ఇంగ్లాండ్ వశమైంది. దీంతో భారత క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ అభిమానులు, విశ్లేషకులే కాదు మాజీ క్రికెటర్లు కూడా భారత ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిస్తున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత బ్యాటింగ్ లైనప్ పై విమర్శలు చేశారు. తాజాగా సౌరవ్ గంగూలీ కూడా ఈ సీరీస్ ఓటమిపై సీరియస్ గా స్పందించారు.

ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఐదు టెస్ట్ ల సీరీస్ ను కోల్పోడానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ గంగూలీ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఓటమిలో ఆటగాళ్ల బాధ్యతారాహిత్యం కంటే కోచ్ ల బాధ్యతారాహిత్యమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా టీంఇండియా బ్యాట్ మెన్స్ లో  ఆత్మస్థైర్యం దెబ్బతిందని అన్నారు. వారికి దైర్యాన్ని నూరిపోయడంలో, ఆత్మవిశ్వాసంగా ఎలా ఆడాలో సూచించడంలో కోచ్ రవిశాస్త్రి విపలమయ్యాడని అన్నారు.

ఆటగాళ్లపై ఒత్తిడి వున్నపుడు కోచ్ లే వారిలో ధైర్యాన్ని నింపాలని గంగూలి అన్నారు. కానీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ ప్రారంభమైనప్పటి నుండి భారత ఆటగాళ్లు ఒత్తిడితోనే ఆడుతున్నారని అన్నారు. కేవలం కెప్టెన్ కోహ్లీ మాత్రమే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి మంచి పరుగులు సాధించగలిగారని సౌరవ్ గుర్తుచేశారు. ఇలా ఆటగాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడంలో విపలమైన భారత జట్టు కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ లే ఈ సీరీస్ ఓటమికి కారణమంటూ గంగూలీ తేల్చిచెప్పారు.

click me!