యువతితో విరాట్ ఫోటో.. నెటిజన్ల ట్రోల్స్

By ramya neerukondaFirst Published Oct 10, 2018, 1:44 PM IST
Highlights

ఈ సందర్భంగా ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన స్పోర్ట్స్‌ స్టార్స్‌లో ఒక్కొక్కరికి విరాట్‌ స్వయంగా వాచ్‌లు అందజేస్తూ ఫొటోలు దిగాడు. 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఓ యువతితో ఫోటో దిగే విషయంలో ఆయన చేసిన పనిని ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు.  ఇంతకీ మ్యాటరేంటంటే..

ఓ వాచ్‌ల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన కోహ్లీ.. ఆ కంపెనీ నిర్వహించిన ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన స్పోర్ట్స్‌ స్టార్స్‌లో ఒక్కొక్కరికి విరాట్‌ స్వయంగా వాచ్‌లు అందజేస్తూ ఫొటోలు దిగాడు. ఈ క్రమంలోనే టెన్నిస్‌ యువ క్రీడాకారిణి కర్మాన్‌ కౌర్‌తో కలిసి పోజిచ్చేందుకు సిద్ధమైన విరాట్‌.. ఆమె తనకంటే హైట్‌ కావడంతో ఇద్దరం ఒకే ఫ్రేమ్‌లో కనబడాలని పక్కనే ఉన్న పోడియంపైకి ఎక్కి ఫొటోలకు పోజిచ్చాడు.
 
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఎందుకంత అహంకారం.. మహిళ కంటే పొట్టిగా ఉంటే వచ్చే నష్టమేంట’ని ఒకరు.. ‘29 ఏళ్ల కోహ్లీ ఎత్తు 175 సెం.మీ.. 20 ఏళ్ల కర్మాన్‌ కౌర్‌ ఎత్తు 183 సెం.మీ. అయినా ఈ ఫొటోలో విరాటే హైట్‌గా కనిపిస్తున్నాడు. టిస్సాట్‌ ప్రచారానికి ఇదెలా ఉపయోగపడుతుంది’ అంటూ మరొకరు.. ‘ఇదెంత అవమానం.. ఓ ప్రముఖ క్రికెటరైన విరాట్‌ ఇలా చేయడమా.. సిగ్గుపడాలి’ అని ఇంకొకరు ట్వీట్లు చేసి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

click me!