నాకు లంచం ఆఫర్ చేశాడు.. ఆసిస్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

Published : Oct 10, 2018, 10:52 AM IST
నాకు లంచం ఆఫర్ చేశాడు.. ఆసిస్ మాజీ క్రికెటర్  సంచలన కామెంట్స్

సారాంశం

మరొక సందర్భంలో ఒక బుకీ కూడా తనను కొనుగోలు చేయడానికి యత్నించాడన్నాడు. అతను శ్రీలంకకు చెందిన బుకీగా వార్న్‌ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సంచలన కామెంట్స్ చేశాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో ప్రత్యర్థి జట్టు క్రికెటర్‌ ఒకరు భారీ మొత్తం లంచం ఇవ్వడానికి యత్నించిన విషయాన్ని వార్న్‌ వెల్లడించాడు. ప్రధానంగా క్రికెటర్లతో ఉన్న రిలేషన్‌షిప్స్‌తో పాటు తన వైవాహిక జీవితంలో  ఎదురైన చేదు అనుభవాలు గురించి పేర్కొన్న వార్న్‌.. 1994-95 సీజన్‌లో పాకిస్తాన్‌తో కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సలీం మాలిక్‌ లంచాన్ని ఆఫర్ చేసినట్లు తెలిపాడు.

తాను ఆఫ్‌ స్టంప్‌ బంతులు వేయాలని కోరిన  మాలిక్, అందుకు దాదాపు రెండు లక్షల యూఎస్‌ డాలర్లను ఇవ‍్వబోయాడన్నాడు. మరొక సందర్భంలో ఒక బుకీ కూడా తనను కొనుగోలు చేయడానికి యత్నించాడన్నాడు. అతను శ్రీలంకకు చెందిన బుకీగా వార్న్‌ పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఐదువేల డాలర్లను తాను పొగొట్టుకున్నానని, దాన్ని సహచర క్రికెటర్‌ మార్క్‌ వా ఇవ్వబోతే వద్దనన్నట్లు తెలిపాడు.

ఇదిలా ఉంచితే, తన వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వార్న్‌ వివరించాడు. ‘ నా వైవాహిక జీవితం గురించి చెప్పుకోవాలంటే సిమోన్‌తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం ఒకటైతే, అటు తర్వాత ఎలిజిబెత్‌ హర్లీతో తెగతెంపులు. ఈ రెండే నా వివాహ జీవితంలో చవిచూసిన చేదు జ్ఞాపకాలు. వారితో విడిపోయినప్పటికీ ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నాం’ అని వార్న్‌ పేర్కొన్నాడు.

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ