ప్లే గ్రౌండ్ లో దుస్తులిప్పేసిన క్రీడాకారిణి.. మగాళ్లు చేస్తే తప్పు లేదా?

By ramya neerukondaFirst Published Aug 31, 2018, 11:00 AM IST
Highlights

కార్నెట్‌ తన టాప్‌ను సరిగా ధరించలేదు. వెనుక భాగం ముందుకు వచ్చేలా ధరించింది. ఈ విషయాన్ని ఆమె బాయ్‌ఫ్రెండ్‌ గుర్తించి సైగ చేశాడు. దీంతో వెంటనే కోర్టులోనే ఆమె తన టాప్‌ను తీసి సరిగా వేసుకుంది.

యూఎస్‌ ఓపెన్‌లో ఫ్రాన్స్‌ క్రీడాకారిణి అలిజె కార్నెట్‌ చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మీరు గమనించే ఉంటారు. క్రీడాకారుల్లో చాలా మంది అబ్బాయిలు ప్లే గ్రౌండ్ లోనే టీ షర్ట్స్ మార్చుకోని.. ఆ తర్వాత వారి గేమ్ ని కంటిన్యూ చేస్తారు. అయితే.. అదే పని ఓ క్రీడాకారిణి చేయడం వివాదాస్పదమైంది. అయితే.. ఆమె చేసిన పనిలో తప్పేమీ లేదని నెటిజన్లు అండగా నిలివడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే...

జొహన్నా లార్సన్‌తో తొలిరౌండ్‌ మ్యాచ్‌లో కార్నెట్‌ తన టాప్‌ను సరిగా ధరించలేదు. వెనుక భాగం ముందుకు వచ్చేలా ధరించింది. ఈ విషయాన్ని ఆమె బాయ్‌ఫ్రెండ్‌ గుర్తించి సైగ చేశాడు. దీంతో వెంటనే కోర్టులోనే ఆమె తన టాప్‌ను తీసి సరిగా వేసుకుంది. యుఎస్‌ ఓపెన్‌లో వేడి విపరీతంగా ఉండడంతో నిర్వాహకులు.. అమ్మాయిలకు మూడో సెట్‌కు ముందు, అబ్బాయిలకు నాలుగో సెట్‌కు ముందు పది నిమిషాలు విరామం ఇచ్చారు.

కార్నెట్‌ కూడా ఈ విరామంలోనే తన టాప్‌ను మార్చుకుంది. అయితే తప్పుగా వేసుకొని కోర్టులోకి వచ్చింది. దీంతో మళ్లీ ఎందుకు లాకర్‌ రూమ్‌లోకి వెళ్లడమెందుకని.. కోర్టులోనే పది సెకన్ల వ్యవధిలో మార్చుకుంది. ఐతే లో దుస్తులు కనిపించేలా కార్నెట్‌ ఇలా చేయడాన్ని ఛైర్‌ అంపైర్‌ తప్పుపట్టాడు. నిబంధనల ప్రకారం ఆమెను మందలించాడు. డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం క్రీడాకారిణులు కోర్టులో దుస్తులు మార్చుకోకూడదు. పురుషుల విషయంలో మాత్రం ఇలాంటి నిబంధనేమీ లేదు. 

కాగా.. దీనిపై నెటిజన్లు కార్నెట్ కి మద్దతు పలికారు. అబ్బాయిలు చేస్తే కాని తప్పు.. అమ్మాయిలు చేస్తే ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 

click me!