ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

Published : Aug 30, 2018, 06:25 PM ISTUpdated : Sep 09, 2018, 01:45 PM IST
ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

సారాంశం

ఆసియా క్రీడల్లో భారత జట్టు పతకాల పంట పండిస్తోంది. తాజాగా భారత క్రీడాకారుడు జిన్ సన్ జాన్సన్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతడు పురుషుల 1500 మీటర్ల పరుగులో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు.

ఇండోనేషియాలో జరుగుతున్న ఈ ఆసియా దేశాల సమరంలో ప్రస్తుతం భారత్ పతకాల పరంగా టాప్ టెన్ లో నిలించింది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 11 స్వర్ణ, 20 రజత, 25 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 56 పతకాలను భారత క్రీడాకారులు కొల్లగొట్టారు.

ఈ ఆసియా దేశాల మధ్య క్రీడా సమరం మొదలై ఇవాళ్టికి పన్నెండు రోజులు అవుతోంది. ఇవాళ హెప్థాట్లెథ్ లో స్వప్న బర్మన్ గోల్డ్ మెడల్ సాధించగా, ట్రిపుల్ జంపర్ అర్పింధర్ సింగ్ కూడా ఆమె బాటలోనే నడిచి మరో గోల్డ్ సాధించాడు. మరో క్రీడాకారిణి ద్యుతి చంద్ 100 మీటర్ల పరుగు పందుంలో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది.   

PREV
click me!

Recommended Stories

Shikhar Dhawan : గబ్బర్ సింగ్ ఇంట పెళ్లి బాజాలు.. ఫారిన్ పిల్లతో ధావన్ నిశ్చితార్థం! పెళ్లి ఎప్పుడు?
రాసిపెట్టుకోండి.! చిన్నస్వామి స్టేడియానికి ఇక కోహ్లీ రానట్లే.? కొత్త గ్రౌండ్ కోసం వెతుకులాట..