రష్యా సెల్ఫ్ గోల్.. ఉరుగ్వే విక్టరీ

Published : Jun 26, 2018, 11:19 AM IST
రష్యా సెల్ఫ్ గోల్.. ఉరుగ్వే విక్టరీ

సారాంశం

రష్యా సెల్ఫ్ గోల్.. ఉరుగ్వే విక్టరీ

హైదరాబాద్: గ్రూప్ ఎ లో హోస్ట్ టీమ్ రష్యాతో జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే 3-0 గోల్స్ తేడాతో బ్రహ్మండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. లూయిస్ సౌరెజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరంభం నుంచి ఉరుగ్వే దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి రష్యా నానా తంటాలు పడింది. ఫస్టాఫ్‌లో 10వ నిముషం వద్ద తొలి గోల్ చేసిన లూయిస్ ఉరుగ్వేకు 1-0 ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. ఆ క్రమంలో కంగారుపడిన రష్యా మిడ్ ఫీల్డర్ డెనిస్ చెరీషెవ్ 23వ నిముషంలో సెల్ఫ్ గోల్ చేశాడు. దీంతో ఉరుగ్వే 2-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఆ విధంగా ఫస్టాఫ్ ముగిసే సమయానికి రష్యా ఒక్క గోల్ కూడా చేయని కారణంగా ఉరుగ్వే అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. 


సెకండాఫ్‌‌కు వచ్చేసరికి ఉరుగ్వే మరింత రెచ్చిపోయింది. అయితే ప్రత్యర్థి ప్లేయర్స్ గోల్ పోస్టులపై అదేపనిగా చేస్తున్న దాడులను రష్యా అంతే సమర్థమంతంగా తిప్పికొట్టింది. ఆ క్రమంలో ఆట చివర్లో, 90వ నిముషంలో ఉరుగ్వే ప్లేయర్ ఎడ్నసన్ కావానీ గోల్ చేయడంతో రష్యాపై 3-0 గోల్స్ తేడాతో ఉరుగ్వే విజయం సాధించింది.

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర