టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ...78 బంతుల్లో 208 పరుగులు

By Arun Kumar PFirst Published Nov 3, 2018, 4:05 PM IST
Highlights

భారత సంతతికి చెందిన ఓ ఆటగాడు క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. డబుల్ సెంచరీ అంటే ఒకప్పుడు టెస్టుల్లోనే చూసేవాళ్లం. అయితే సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల అద్భుత ఆటతీరు కారణంగా వన్డేల్లో కూడా డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అయితే టీ20 ల్లో ఇప్పడప్పుడే డబుల్ సెంచరీ నమోదవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ టీ20 రికార్డులను బద్దలుగొడుతూ ఓ భారత సంతతి క్రీడాకారుడు డబుల్ సెంచరీ బాదాడు. 

భారత్‌కు చెందిన 19 ఏళ్ల కేవీ హరికృష్ణన్‌ యూఏఈ అండర్‌-19 జట్టులో సభ్యుడు. అయితే ఇతడు క్లబ్ క్రికెట్ టోర్నీలో భాగంగా  స్పోర్టింగ్ టీమ్ తరపున బరిలోకి దిగిన అద్భుతాన్ని సృష్టించాడు. మాచోస్‌ జట్టుతో టీ20 మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగిన హరికృష్ణన్‌ కేవలం 78 బంతుల్లోనే 208 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇతడు ఆరంభంనుండి బౌండరీలతో రెచ్చిపోతూ ఏకంగా 22 ఫోర్లు, 14 సిక్సర్లు బాదాడు. 

హరికృష్ణన్‌ ద్విశతకం సాధించడంతో స్పోర్టింగ్‌ క్లబ్‌ జట్టు 20 ఓవర్లలో 250 పరుగులు చేసింది. భారీ స్కోరును సాధించినప్పటికి బౌలర్లు విఫలమవడంతో హరికృష్ణన్ సెంచరీ వృధా అయ్యింది.  ప్రత్యర్థి మాచోస్‌ జట్టు బ్యాట్ మెన్స్ కూడా చెలరేగి ఆడి కేవలం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. అయితే టీ20 లో డబుల్ సెంచరీతో రికార్డును నెలకొల్పిన హరికృష్ణన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.    

click me!