టీంఇండియాకు కేటీఆర్, కవిత అభినందనలు...

Published : Jan 19, 2019, 12:00 PM IST
టీంఇండియాకు కేటీఆర్, కవిత అభినందనలు...

సారాంశం

ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయం సాధించడమే గొప్పతనంగా భావిస్తుంటే బోనస్ గా వన్డే సీరిస్ ను కూడా కోహ్లీ సేన కైవసం చేసుకుంది. ఇలా మొట్టమొదటి సారి వరుసగా టీ20 సీరిస్ ను సమం చేసి, టెస్ట్, వన్డే సీరిస్ లను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపి కవిత అభినందించారు. 

ఆస్ట్రేలియా జట్టుతో వారి స్వదేశంలోనే జరిగిన ద్వైపాక్షిక టెస్ట్, వన్టే సీరిస్ను గెలుచుకున్న ఇండియన్ క్రికెట్ టీంకు  మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు  మాజీ  మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాపై మునుపెన్నడూ లేని విధంగా సాధించిన ఈ విజయం క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.  

టీంఇండియా ఆస్ట్రేలియాపై సాధించిన చాతిత్రక విజయంపై నిజామాబాద్ ఎంపి కవిత కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. గొప్ప పోరాటంతో సాధించిన ఈ విజయానికి టీంఇండియా అర్హమైందిగా కవిత పేర్కొన్నారు. ఆసిస్ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించి గొప్ప విజయాన్ని అందుకున్న భారత జట్టుకు ఆమె అభినందనలు తెలిపారు. 

Congratulations to Indian Cricket team for a well contested and well deserved victory in Australia!

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !