టెస్ట్ మ్యాచుల్లో టాస్ ఉండాల్సిందే : ఐసిసి క్రికెట్ కమిటీ సూచన

First Published May 30, 2018, 12:23 PM IST
Highlights

అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసిసి క్రికెట్ కమిటీ పలు కీలక సూచనలు

టెస్ట్ క్రికెట్ లో టాస్ విధానానికి స్వస్తి పలకాలని చూసిన ఐసిసి ఆలోచనను అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసిసి క్రికెట్ కమిటీ వ్యతిరేకించింది. క్రికెట్ లో అంతర్భాగమైన టాస్ విధానాన్ని టెస్టుల్లో యదావిధిగా కొనసాగించాలని ఐసిసి కి సూచించింది. ముంబయిలో రెండు రోజుల పాటు జరిగిన క్రికెట్ కమిటీ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై చర్చించి ఐసిసి కి పలు కీలక సూచనలు చేసింది.

టెస్ట్ మ్యాచుల్లో ఆతిథ్య జట్టుకు అపుకూలంగా పిచ్ తయారుచేసుకుంటారు. కాబట్టి పర్యటక జట్టు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ఎంచుకునే అవకాశం పర్యటక జట్టుకు ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై చర్చించిన క్రికెట్ కమిటీ టాస్ విధానాన్ని కొనసాగించాలని, దాని వల్ల ఎవరికి నష్టం లేదని సూచించింది.

బాల్ ట్యాంపరింగ్ లాంటి వ్యవహారాల్లో పాలుపంచుకున్న ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో భవిష్యత్ లో ట్యాంపరింగ్ జరక్కుండా అడ్డుకోవచ్చని, ఆటగాళ్ల ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని కౌన్సిల్ తెలిపింది.  2019 జులై నుంచి ఆరంభంకానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా ఈ టాస్ విధానమే కొనసాగించాలని కమిటీ ఐసీసికి సూచించింది.
 

click me!