Tokyo Olympics:సెమీస్ లోకి దూసుకెళ్లిన భారత రెజ్లర్లు దీపక్ పూనియా,రవి దహియా

By team teluguFirst Published Aug 4, 2021, 9:48 AM IST
Highlights

భారత రెజ్లర్స్ రవి దహియా, దీపక్ పూనియా క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించి సెమిస్ లోకి దూసుకెళ్లారు. 

భారత రెజ్లర్స్ రవి దహియా, దీపక్ పూనియా క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించి సెమిస్ లోకి దూసుకెళ్లారు. బుల్గేరియాకు చెందిన వంగేలోవ్ తో రవి తలపడి గెలిచాడు. చైనా యోధుడితో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో దీపక్ విజయం సాధించాడు. 

తొలి పీరియడ్ ఆరంభంలోనే టేక్ డౌన్ ద్వార్స్ 2 పాయింట్లను సాధించాడు. ఆ తరువాత మరో టేక్ డౌన్ సాధించి రెండు పాయింట్లు, ఆ వెంటనే మరో రెండు పాయింట్లతో 0-6 తో లీడ్ లో నిలిచాడు. ఆ తరువాత రెండవ పీరియడ్ లో 10-2 తో లీడ్ లోకి దూసుకెళ్లిన రవి కుమార్ ఆ తరువాత టెక్నికల్ సుపీరియారిటీ తో గెలిచి సెమీస్ లోకి దూసుకెళ్లాడు. 

దీపక్ పూనియా కూడా చైనా రెజ్లర్ తో క్వార్టర్స్ లో అనూహ్యమైన విజయం సాధించాడు. ఫస్ట్ పీరియడ్ లో ఆధిక్యంలో ఉన్న దీపక్... రెండవ పీరియడ్ లో చెరిసమంగా నిలిచారు. ఆఖరు 20 సెకండ్లలో అద్భుతమైన పట్టుతో సెమీస్ లోకి దూసుకెళ్లాడు. దీపక్ మ్యాచులో ఆఖరి కొద్దీ సెకండ్లలో భారతీయ అభిమానులంతా నరాలు తేజ్ ఉత్కంఠ మధ్య మ్యాచ్ ని చూసారు. ఆఖరి మూవ్ మాత్రం అద్భుతం అని చెప్పక తప్పదు. 

ఇక ఉదయం జరిగిన మ్యాచులో ఇద్దరు రెజ్లర్లు కూడా టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించి క్వార్టర్స్ లోకి దూసుకొచ్చారు. అంతకుముందు జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా, ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, టేబుల్ టాపర్‌గా నేరుగా ఫైనల్స్‌కి అర్హత సాధించాడు.

గ్రూప్ బీలో పోటీపడిన భారత జావెలిన్ త్రో ప్లేయర్ శివ్‌పాల్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. మొదటి ప్రయత్నంలో 76.40 మీటర్లు విసిరిన శివ్‌పాల్ సింగ్, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ఆ మార్కును దాటలేకపోయాడు. 

మహిళల 57 కేజీల విభాగంలో పోటీపడిన అన్షూ మాలిక్‌, తొలి రౌండ్‌లోనే ఓడింది. ఇర్యాన కురాచ్‌కినాతో జరిగిన మ్యాచ్‌లో 2-8 తేడాతో ఓడింది అన్షూ.

click me!