కొలంబియన్ రెజ్లర్‌తో జరిగిన మ్యాచ్‌ల 13-2 తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్న భారత రెజ్లర్ రవికుమార్ దహియా...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి రెజ్లింగ్‌లో తొలి విజయం దక్కింది. 57 కేజీల ఫ్రీ స్టైయిల్ విభాగంల జరిగిన తొలి మ్యాచ్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా, కొలంబియన్ రెజ్లర్ ఆస్కర్ టిగ్రేరోస్‌తో జరిగిన మ్యాచ్‌ల 13-2 తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్నాడు.
అంతకుముందు జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా, ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, టేబుల్ టాపర్‌గా నేరుగా ఫైనల్స్‌కి అర్హత సాధించాడు.
undefined
గ్రూప్ బీలో పోటీపడిన భారత జావెలిన్ త్రో ప్లేయర్ శివ్‌పాల్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. మొదటి ప్రయత్నంలో 76.40 మీటర్లు విసిరిన శివ్‌పాల్ సింగ్, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ఆ మార్కును దాటలేకపోయాడు.
మహిళల 57 కేజీల విభాగంలో పోటీపడిన అన్షూ మాలిక్, తొలి రౌండ్‌లోనే ఓడింది. ఇర్యాన కురాచ్‌కినాతో జరిగిన మ్యాచ్‌లో 2-8 తేడాతో ఓడింది అన్షూ.